Asianet News TeluguAsianet News Telugu

ఉపేంద్ర 'కబ్జా' రైట్స్ సొంతం చేసుసున్న యంగ్ హీరో!

 రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది. కేజీఎఫ్ రేంజ్ లో టీజర్ ఉందని అందరూ మెచ్చుకున్నారు. 

Nitin has acquired the Telugu rights of Upendra Kabzaa at a fancy rate
Author
First Published Feb 2, 2023, 8:07 AM IST


 ఈ మధ్య కాలంలో కన్నడ పరిశ్రమ  నుంచి వస్తున్న సినిమాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ విజయం సాధిస్తున్నాయి. కేజీఎఫ్, కాంతార వంటి సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. ఈ క్రమంలో  మరో సినిమా పాన్ ఇండియా బాక్స్ పై దాడికి సిద్దమవుతుంది. అదే కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన ‘కబ్జా’. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది. కేజీఎఫ్ రేంజ్ లో టీజర్ ఉందని అందరూ మెచ్చుకున్నారు. దాంతో ట్రేడ్ లో  ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా వైడ్ ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. కన్నడ, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాది మార్చి 17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. 

 నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే లాస్ట్ ఇయిర్ ఈ బ్యానర్‌పై స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా, దానికి ఓ రేంజిల  రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలో  విక్రమ్ సినిమా తరువాత మరో డబ్బింగ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు. 

ఈసారి కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘కబ్జా’ చిత్రాన్ని టాలీవుడ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాను రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఎన్ సినిమాస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నట్లు హీరో నితిన్ ప్రకటించాడు. కబ్జా చిత్రంలో ఉపేంద్రతో పాటు మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

బ్రిటిషర్లు పాలిస్తున్న 1942 కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతుంది. ఈ మూవీలో మరో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్నాడు. ఈ ఇద్దరికీ సౌత్ లోని అన్ని లాంగ్వేజ్స్ లో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ చూసే అవకాశం ఉంది అంటున్నారు సినిమా పండితులు. 
 
ఇక  ఈ సినిమాలో అందాల భామ శ్రియా సరన్ ఓ కీలక పాత్రలో నటిస్తోండగా, ఈ చిత్రాన్ని ఆర్.చంద్రు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా మార్చి 17న రిలీజ్ చేస్తుండగా, ఈ సినిమాకు కేజీయఫ్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరమైన అంశం.

Follow Us:
Download App:
  • android
  • ios