Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ బాబుతో కలిసి 'బార్' పెడుతున్న నిత్యామేనన్.. ఐడియా భలే ఉందే

మొత్తం 38 లక్షలు కడితే ఆ ఇల్లు దక్కుతుందని తెలియడంతో బార్ పెట్టాలని రెడీ అవుతుంది.ఈ క్రమంలో ఆమెకు ఎదురైన ఛాలెంజ్ లు, సమస్యలు ఏంటి? 

Nithya menon kumari srimathi official trailer released jsp
Author
First Published Sep 23, 2023, 7:35 AM IST


  నిత్యామేనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే ఆమె  మొదటి వరసలో ఉంటుంది.  ఎలాంటి పాత్రలోకి అయినా పరకాయప్రవేశం చేసే ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేసి సినిమాని మోయగలదు అని గతంలో ప్రూవ్ చేసుకుంది. అయితే మారుతున్న కాలంలో వెబ్ సీరిస్ లకు వస్తున్న ఆదరణతో ఆమె  వాటిల్లో బిజీ అవుతోంది.  గతంలో నిత్యామేనన్   బ్రీత్, ఇన్ టు ద షాడోస్, మోడ్రన్ లవ్ హైదరాబాద్ లాంటి సిరీస్ లతో ఆకట్టుకుంది.  తాజాగా ఆమె కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి కాని వారిని సాధారణంగా కుమారి అని సంభోధిస్తారు. పెళ్లైన వారిని శ్రీమతి అని సంభోధిస్తారు. ఇందులో ఆమె పేరు శ్రీమతి, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి కుమారి శ్రీమతి. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చాలా డిఫరెంట్ గా ఉంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా సెప్టెంబరు 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.ఆమె పేరు మీద ఉన్న ఫన్ తో ఈ ట్రైలర్ మొదలైంది. ఎన్ని సంభందాలు వచ్చినా రిజెక్ట్ చేసే ఆమె తన తాతల నాటి ఇంటిని తిరిగి దక్కించుకునేందుకు ఇటికెల పూడి శ్రీమతి (నిత్యామేనన్‌) బార్‌ పెట్టాలని ఫిక్సైంది. అదెలా అంటే ఇల్లు సొంతం చేసుకునే వరకు పెళ్లి చేసుకోను అనే ఆమె..  వెనకపడే హీరో తిరువీర్. ఆ ఇంటిని తన బాబాయ్ లాక్కోవడం.. మొత్తం 38 లక్షలు కడితే ఆ ఇల్లు దక్కుతుందని తెలియడంతో బార్ పెట్టాలని రెడీ అవుతుంది.ఈ క్రమంలో ఆమెకు ఎదురైన ఛాలెంజ్ లు, సమస్యలు ఏంటి? మరి ఇంటిని దక్కించుకుని, పెళ్లి చేసుకుందా? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే! తన తాత కట్టించిన ఇంటిని దక్కించుకోవడానికి ఎంతో కష్టమైన భరించే అమ్మాయి పాత్రలో కనిపించింది నిత్యామీనన్. 
 
ఇక ఈ సిరీస్ లో కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు  నటుడు నిరుపమ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక, ఇటీవల మసూదతో హిట్ కొట్టిన హీరో తిరువీర్ కూడా నటిస్తున్నాడు. అలాగే మాజీ హీరోయిన్  గౌతమి తల్లి పాత్రలో నటించారు.     ఒక స్త్రీ వ్యక్తిత్వాన్ని ఇందులో చూపించనున్నామని చెప్తున్నారు. గోమటేశ్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించారు. దర్శకుడు-నటుడు శ్రీనివాస్‌ అవసరాల ఈ సిరీస్‌కు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ‘కుమారి శ్రీమతి’ స్ట్రీమింగ్‌ కానుంది. ఎర్లీ మాన్‌సూన్‌ టేల్స్‌, స్వప్న సినిమాస్‌ ఈ సిరీస్‌ను నిర్మించాయి.

అలాగే  ‘కుమారి శ్రీమతి’ సిరీస్‌  టీమ్ ఓ కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మొదటి ఎపిసోడ్‌ను థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. సెప్టెంబరు 24న, సాయంత్రం 4 గంటలకు కాకినాడ (పద్మ ప్రియ కాంప్లెక్స్‌), భీమవరం(నటరాజ్‌ థియేటర్‌)లలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్స్‌ ఆహ్వానిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios