రీసెంట్ గా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తాను  ఓ వారం రోజులు పాటు ఆశ్రమంలో గడిపొచ్చానని చెప్పింది నటి నిత్యామీనన్‌. కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో  ఎందుకిలా నిత్యామీనన్  ఆధ్యాత్మిక మార్గం పట్టింది అని చాలా మందికి డౌట్ వచ్చింది. దాంతో ఆమెకు మెసేజ్ లు,ఫోన్స్ చేస్తున్నారు.  అయితే అందుకు కారణం మాత్రం ఆధ్యాత్మకత మాత్రం కాదంటోంది.

నిత్యామీనన్ మాట్లాడుతూ ఆ అశ్రమంలో  మతం గురించి నేర్చుకోలేదు గానీ, నా గురించి నేను తెలుసుకున్నానని చెప్పింది. పాఠాలు నేర్పడానికి చాలా  కాలేజీలు ఉన్నాయి. మనుషులైన మన గురించి ఏ కాలేజీల్లోనూ చెప్పడం లేదు అని అంది.  ఇవి అత్యవసరమైన పాఠాలు అని, తప్పనిసరిగా నేర్చుకోవాల్సినవి అని చెప్పుకొచ్చింది. అలాగని ఆ ఆశ్రమం పేరు , ఎక్కడ ఉన్నది మాత్రం రివీల్ చేయలేదు. కేరళలలోని ఓ ఆశ్రమంలో అని మాత్రం తెలిసింది. 

ఇప్పటివరకు సౌత్‌లో సత్తా చాటి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నిత్యామీనన్‌. కేవలం సౌత్ సినిమాలే కాక బాలీవుడ్ ప్రాజెక్ట్ ల పైనా దృష్టి పెట్టారు.  ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) మార్స్‌ మిషన్‌ ఆధారంగా తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాలో నిత్యామీనన్‌ శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. అక్షయ్‌ కుమార్, విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ప్రస్తుతం ది ఐరన్‌ లేడీ చిత్రంలో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నిత్యామీనన్‌ పేర్కొంది.