‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ (Extra Ordinary Man) చిత్రానికి రూ.23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి రూ.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.4.65 కోట్ల షేర్ ను రాబట్టింది. 


సినిమాలను ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్నప్పుడు తేడా కొడితే చాలా నష్టపోతున్నారు. అలాంటప్పుడు ఆ నష్టాలను భరించటానికి ఒక్కోసారి నిర్మాతలు, హీరోలు నడుం బిగించాల్సి వస్తోంది. లేకపోతే వాళ్ల తర్వాత సినిమాల బిజినెస్ పై ఆ ఇంపాక్ట్ పడుతోంది. గతంలో చాలా సార్లు సినిమాలు డిజాస్టర్ అయ్యినప్పుడు నష్టాల నుంచి డిస్ట్రిబ్యూటర్స్ ని బయిటపడేయటానికి ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో అలాంటి సంఘటన చోటు చేసుకోబోతోందని ట్రేడ్ వర్గాల సమాచారం. 

నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రేష్ఠ్ మూవీస్’, ‘రుచిర ఎంటర్టైన్మెంట్స్’, ‘ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్’ బ్యానర్ల పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. డిసెంబర్‌ 8న రిలీజ్ అయిన ఈ చిత్రానికి జస్ట్ ఓకే అనిపించే టాక్ వచ్చింది.కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది అని చెప్పాలి. దాంతో సినిమా వీకెండ్ అయ్యేసరికి డిజాస్టర్ గా నమోదు అయ్యింది. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ (Extra Ordinary Man) చిత్రానికి రూ.23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి రూ.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.4.65 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.19.35 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.బ్రేక్ ఈవెన్ అవ్వడం ఇక అసాధ్యమనే చెప్పాలి. ఈ క్రమంలో నితిన్ తనను నమ్మి సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కు కాంపన్సేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

అందుతున్న సమాచారం మేరకు నితిన్, ఆయన తండ్రి సుధాకర రెడ్డి కొందరు డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి ఈ మేరకు ప్రామిస్ చేసినట్లు చెప్తున్నారు. నష్టాలలో కొంత పర్శంటేజ్ భరిస్తామని, సాధ్యమైనంత త్వరలో ఆ విషయమై క్లారిటీ ఇస్తామని చెప్పారట. నితిన్ సొంత బ్యానర్ కావటంతో తనే యాక్టివ్ పార్ట్ తీసుకుని మాట్లాడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏదైమైనా 80% వరకూ వచ్చిన నష్టాన్ని క్లియర్ చేయటం అంటే కష్టమే అని, అయినా ముందుకువచ్చి డిస్ట్రిబ్యూటర్స్ కు ధైర్యం చెప్పటం మాత్రం నితిన్ చేస్తున్న గొప్ప పనిగా చెప్తున్నారు.