ఎందుకు రిస్క్...ప్రాజెక్టు కాన్సిల్ అన్నాడట

‘చెక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక చతికిల పడింది. ‘రంగ్ దే’ మాత్రం జస్ట్ ఓకే అనిపించుకుని యావరేజ్ లిస్ట్ లో చేరింది. దాంతో భీష్మతో వచ్చిన క్రేజ్ మొత్తం పోయింది. ఇది నితిన్ కు డైజస్ట్ చేసుకోవటం కాస్తంత కష్టంగానే ఉంది. 

Nithin Takes Stern Decision After Back To Back Failures jsp

హిట్ లో ఉన్నప్పుడు ఏదైనా చేసేయగలం అనిపిస్తుంది. రెండు ప్లాఫ్ లు పడేసరికి కంగారు వస్తుంది. ఆచి తూచి అడుగులు వేయాలనిపిస్తుంది. ఇప్పుడు నితిన్ పరిస్దితి అదే. గత ఏడాది ‘భీష్మ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ వరసగా నాలుగు ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే అందులో  రెండు సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి.   ఇప్పటికే ‘చెక్’, ‘రంగ్ దే’ సినిమాలు నితిన్ నుంచి వచ్చాయి. అయితే ‘చెక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక చతికిల పడింది. ‘రంగ్ దే’ మాత్రం జస్ట్ ఓకే అనిపించుకుని యావరేజ్ లిస్ట్ లో చేరింది. దాంతో భీష్మతో వచ్చిన క్రేజ్ మొత్తం పోయింది. ఇది నితిన్ కు డైజస్ట్ చేసుకోవటం కాస్తంత కష్టంగానే ఉంది. 

దాంతో తన నెక్ట్స్ ప్రాజెక్టులని ఒకసారి చెక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తను ప్రతిష్టాత్మకంగా మొదలెడదామనుకున్న పవర్ పేట సినిమాని ఆపేయాలనుకున్నారట. ఆ సినిమా రెండు పార్ట్ లుగా చేయాలనుకున్నారట. మాస్ట్రో అయిన వెంటనే డేట్స్ ఇద్దామనుకున్నాడు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేసి , వేరే ప్రాజెక్టుతో ముందుకు వెళ్దాం. టైమ్ బాగుంటే నెక్ట్స్ చూద్దాం అని డైరక్టర్ కి డైరక్ట్ గానే చెప్పాసాడట. పవర్ పేట చిత్రాన్ని కృష్ణ చైతన్య డైరక్ట్ చేద్దామనుకున్నారు. ఆయన ఇంతకు ముందు నితిన్ తో ఛల్ మోహన్ రంగ చిత్రం డైరక్ట్ చేసారు. 

 ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ సినిమా తెలుగులో అఫీషియల్‌గా రీమేక్ చేస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రల్లో నటించగా బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమాని టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ రీమేక్ చేయాలని డిసైడయ్యాడు. మాస్ట్రో గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా టబు పాత్రలో నటిస్తోంది.  రీసెంట్ గా నితిన్ వక్కంతం వంశీ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios