Asianet News TeluguAsianet News Telugu

'రంగ్ దే' 4 డేస్ కలెక్షన్స్,హిట్టేనా లేక...?


మొన్న శుక్రవారం  నితిన్ రంగ్ దే, రానా అరణ్య, సింహ కోడూరి తెల్లవారితే గురువారం సినిమాలు విడుదల అయ్యాయి.  మిగతా రెండింటి కన్నా నితిన్ రంగ్ దే బెస్ట్ అనిపించింది.  అరణ్య, తెల్లవారితే గురువారం సినిమాలు మరీ డిజాస్టర్స్ అయ్యిపోయాయి. రానా అరణ్య పర్లేదని రివ్యూలు వచ్చినా రంగ్ దే కమర్షియల్ గా కాస్త కలెక్షన్స్ దండుకుంది. 
 

Nithin Rang De 4 Days AP, TS Collections Shares  jsp
Author
Hyderabad, First Published Mar 30, 2021, 2:52 PM IST

మొన్న శుక్రవారం  నితిన్ రంగ్ దే, రానా అరణ్య, సింహ కోడూరి తెల్లవారితే గురువారం సినిమాలు విడుదల అయ్యాయి.  మిగతా రెండింటి కన్నా నితిన్ రంగ్ దే బెస్ట్ అనిపించింది.  అరణ్య, తెల్లవారితే గురువారం సినిమాలు మరీ డిజాస్టర్స్ అయ్యిపోయాయి. రానా అరణ్య పర్లేదని రివ్యూలు వచ్చినా రంగ్ దే కమర్షియల్ గా కాస్త కలెక్షన్స్ దండుకుంది. 

నితిన్.. కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన రంగ్ దే సినిమా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీకెండ్ మరియు సోమవారం హోలీ అవ్వడం వల్ల సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతాయని లెక్కలేసారు. కాని సినిమాకు వచ్చిన డివైడ్ టాక్ వల్ల కలెక్షన్స్ యావరేజ్ గా ఉన్నాయి. మరీ దారుణంగా లేకపోవడం ఉన్నంతలో ఊరట కలిగించే విషయం. 

ఇప్పటి వరకు నాలుగు రోజులు పూర్తి చేసుకున్న రంగ్ దే కు మొత్తంగా రూ.12.46 కోట్ల రూపాయలు వసూళ్లు అయినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సాగింది.  


ఏరియా            కలెక్షన్స్(కోట్లలో)

నైజాం                          4.70

సీడెడ్                          1.94

నెల్లూరు                       0.51

కృష్ణా                           0.60

గుంటూరు                     1.25

వైజాగ్                          1.58

ఈస్ట్                            0.97

వెస్ట్                             0.66

టోటల్ ఏపీ & టీస్ షేర్    12.21 

ఈ సినిమా మొత్తంగా రూ.18 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఈ వీకెండ్ వరకు రంగ్ దే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.‘రంగ్ దే' మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 800 థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. పాటలు సంగీత ప్రియులను మరింత  ఆకట్టుకున్నాయి. డీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేసారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios