టాలీవుడ్ లో సినీ ప్రముఖలందరికి బాగా పరిచయమున్న రమేష్ వర్మ హిట్టు కొట్టి చాలా కాలమవుతోంది. జనాలకు ఎక్కువగా కనిపించని ఈ దర్శకుడు చాలా వరకు కథను వినిపించడంలో సిద్దహస్తుడని టాక్. 2009లో రైడ్ సినిమాతో హిట్ కొట్టిన రమేష్ ఆ తరువాత మరో హిట్ అందుకోలేదు. 

2011లో రవితేజతో వీర అనే సినిమా తీసినప్పటికి హిట్ దొరకలేదు. ఆ తరువాత రమేష్ మధ్యలో అబ్బాయితో అమ్మాయి అనే సినిమా చేసినా అది జనాలకు పెద్దగా టచ్ అవ్వలేదు. ఫైనల్ గా కొన్నేళ్ల తరువాత స్టార్ హీరో ఈ దర్శకుడిని నమ్మి అవకాశం ఇస్తున్నాడు. 

జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను ఓకే లెవెల్లో కొనసాగిస్తున్న నితిన్ రమేష్ స్క్రిప్ట్ ను గట్టిగానే నమ్ముతున్నాడు. పైగా సినిమా మ్యూజిక్ కోసం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆగస్ట్ లో సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నితిన్ భీష్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఛలో దర్శకుడు వెంకీ కుడుములు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.