Asianet News TeluguAsianet News Telugu

‘చెక్‌’ మూవీ డే 1 కలెక్షన్స్

చాలా గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయిర్ ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో. భీష్మ కంటే ముందు నితిన్‌ చేసిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో కొంత గ్యాప్‌ తీసుకొన్న నితిన్‌.. ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి  చెక్‌. భీష్మతో పాటు చెక్‌ కూడా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ వల్లనిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్‌  తర్వాత నిన్న శుక్రవారం రోజు (ఫిబ్రవరి 26) చెక్‌ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. 

Nithin latest Check movie day one collectins jsp
Author
Hyderabad, First Published Feb 27, 2021, 4:28 PM IST


చాలా గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయిర్ ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో. భీష్మ కంటే ముందు నితిన్‌ చేసిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో కొంత గ్యాప్‌ తీసుకొన్న నితిన్‌.. ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి  చెక్‌. భీష్మతో పాటు చెక్‌ కూడా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ వల్లనిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్‌  తర్వాత నిన్న శుక్రవారం రోజు (ఫిబ్రవరి 26) చెక్‌ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. 

వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడైన చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది.వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్‌’పై నితిన్‌ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్‌’ కు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఫస్ట్ డే కలెక్షన్స్ చూద్దాం.

ఏరియా కలెక్షన్స్

నైజాం 1.46

సీడెడ్ 0.47

నెల్లూరు 0.08

కృష్ణా 0.21

గుంటూరు 0.54

వైజాగ్ 0.34

ఈస్ట్ 0.14

వెస్ట్ 0.10

టోటల్ ఏపీ & టీస్ షేర్ 3.34

Follow Us:
Download App:
  • android
  • ios