పవన్ తో పాటు నటించేది రానా కాదట...మరి ?

థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రం రాజీప‌డని ఇద్దరు అహంభావం గ‌ల వ్య‌క్తుల జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇందులో ఒకటైన పోలీస్ పాత్రలో పవన్ కనిపిస్తాడంటున్నారు. మరో పాత్ర లో రానా కనిపించే అవకాసం ఉందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Nithin Gets A Chance Opposite Pawan Kalyan?  jsp

మలయాళ అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ లో కూడా పవన్ నటించబోతున్న సంగతి తెలిసిందే.  'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ - పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ముగ్గురూ కలిసి నిర్మిస్తారని సమాచారం. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రం రాజీప‌డని ఇద్దరు అహంభావం గ‌ల వ్య‌క్తుల జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇందులో ఒకటైన పోలీస్ పాత్రలో పవన్ కనిపిస్తాడంటున్నారు. మరో పాత్ర లో రానా కనిపించే అవకాసం ఉందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ప్రాజెక్టుకు క్రేజ్ రావటం కోసం నితిన్ ని సీన్ లోకి తీసుకొస్తే ఎలా ఉంటుందని దర్శక,నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మళయాళ వెర్షన్ కు మార్పులు చేసి తెలుగు వెర్షన్ ని మన నేటివిటికు అణుగుణంగా రూపొందించబోతున్నారట.
 
మలయాళంలో బిజూ మీనన్‌ చేసిన పాత్రను పవన్ తో , పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను నితిన్  చేయనున్నారు. చిత్రంలో హీరోలు ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే సన్నివేశాలున్నాయి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’లోనూ అటువంటి సన్నివేశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. అందుకని, పవన్-నితిన్ హీరోయిజమ్‌ తగ్గకుండా సాగర్‌ చంద్ర సినిమా తీయగలడని భావిస్తున్నారట. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మలయాళ కథపై స్ర్కిప్ట్‌ వర్క్‌ చేస్తున్నట్టు సమాచారం.

 నారా రోహిత్‌, శ్రీ విష్ణుతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో విజయం అందుకున్నారీ యువ దర్శకుడు. అంతకు ముందు రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రధారిగా ‘అయ్యారే’ కూడా తీశారు. అయితే... ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు నచ్చడంతో పవన్, రానా చిత్రాన్ని సాగర్‌ కె. చంద్ర చేతుల్లో పెట్టాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ భావిస్తోందట. 

 మరో ప్రక్క హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. తన జెఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించబోతున్నాడు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios