యంగ్ హీరో నితిన్.. దర్శకుడు వెంకీ కుడుములకి కండీషన్స్ పెడుతూ తలనొప్పిగా మారినట్లు సమాచారం. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో 'భీష్మ' అనే సినిమా మొదలైంది. కథ ఓకే అయి చాలా కాలమవుతున్నా.. కానీ నితిన్ మాత్రం సినిమాను మొదలుపెట్టలేదు.

ఈ ప్రాజెక్ట్ కి ముందు మరేదైనా సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఏదీ సెట్ కాకపోవడంతో 'భీష్మ' మొదలెట్టాడు. దాదాపు ఆరు నెలలుగా ఎదురుచూస్తోన్న వెంకీ కుడుములకి ఫైనల్ గా తన డేట్స్ ఇచ్చాడు నితిన్. అయితే ఈ సినిమా మొదలైందనే ఆనందం కంటే నితిన్ పెట్టిన కండీషన్స్ కారణంగా దర్శకుడు ప్రెషర్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది డిసంబర్ లోపు సినిమాను పూర్తి చేయాలనేది నితిన్ కండీషన్. ఈ ఏడాదిలో తన సినిమా ఎలాగైనా రిలీజ్ చేయాలని నితిన్ పట్టుబడుతున్నాడు. అందుకే డిసంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకోమని చెబుతున్నాడట.

ఇలా డెడ్ లైన్స్ పెడితే క్వాలిటీ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. షూటింగ్ ఆలస్యంగా మొదలుపెట్టి ఇలా డెడ్ లైన్స్ పెట్టడంపై వెంకీ కుడుమల అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కానీ హీరో మాటని కాదనలేక అతడు చెప్పినట్లుగానే చేయడానికి సిధమవుతున్నాడు.