Asianet News TeluguAsianet News Telugu

`బాహుబలి`, `కొబ్బరిమట్ట` సినిమాల్లో జూ.ఆర్టిస్ట్ గా నితిన్‌.. క్రేజీగా `ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌` టీజర్‌..

నితిన్‌.. హీరోగా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ ఆయన జూనియర్‌ ఆర్టిస్ట్ గా చేశాడట. ఏకంగా `బాహుబలి`లో జూ ఆర్టిస్ట్ గా చేయడం విశేషం. ఇదే ఇప్పుడు షాకిస్తుంది.

nithin acted as junior artist in bahubali and kobbari matta movies extra ordinary man teaser crazy arj
Author
First Published Oct 30, 2023, 7:31 PM IST

హీరో నితిన్‌(nithin).. `బాహుబలి`(Bahubali)లో ఉన్నాడు. ఈ సినిమాలో ఆయన జూనియర్ ఆర్టిస్ట్ గా చేయడం విశేషం. బాహుబలిగా చేసిన ప్రభాస్‌ ముందు జూనియర్ ఆర్టిస్ట్ ల మధ్యలో నిల్చొని ఆయనకు దెండం పెడుతూ అమాయకంగా కనిపించారు. `బాహుబలి` సినిమాలో ఆయన్ని గుర్తించలేకపోయాం. కానీ ఇప్పుడు తాను ఎక్కడ నటించాడో చెప్పాడు నితిన్‌. తాను `బాహుబలి`లో జూనియర్‌ ఆర్టిస్ట్ గా చేసినట్టు వెల్లడించాడు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

మరి ఇంతకి కథేంటంటే.. ప్రస్తుతం నితిన్‌ `ఎక్స్ ట్రా ఆర్డినరీమ్యాన్‌` (Extra Ordinary Man) అనే సినిమాలో నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్‌ సెన్సేషన్‌, క్రేజీ బ్యూటీ శ్రీలీల (Sreeleela) ఇందులో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలైంది. సోమవారం సాయంత్రం రిలీజ్‌ చేశారు. ఇందులో కథ అంటే మామూలు కథ కాదు బయ్య, రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న కథ అంటూ టీజర్‌ ప్రారంభం కాగా, ఇందులో విలన్లని నితిన్‌ చితక్కొడుతూ ఎంటర్‌ అయ్యాడు. 

అనంతరం ఆయన జోకర్‌గా, ఇతర రకరకాలు గెటప్‌లో కనిపించిన నితిన్‌ తాను ఏం చేస్తాడో అందరికి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతలో నువ్వు ఆ `కొబ్బరి మట్ట` సినిమాల్లో ఉన్నావ్‌ కదా అని హీరోయిన్‌ శ్రీలీల చెప్పగా, నితిన్‌ షాక్‌ అయ్యాడు. అనంతరం ఆమెతో లవ్‌ ట్రాక్‌ వస్తుంది. అప్పుడు సంపత్‌రాజ్‌కి అసలు కథ చెబుతాడు నితిన్‌. `బాహుబలి` చూశావా? అనగా, నాలుగుసార్లు చూశానని చెప్పగా, వాళ్లల్లో ఆరో లైన్‌లో ఏడో వాడు అని చూపించాడు. అప్పుడు `బాహుబలి` లోని ఓ సీన్‌లో నితిన్‌ జూ ఆర్టిస్ట్ గా కనిపించాడు. తాను జూనియర్‌ ఆర్టిస్ట్ ని అని చెప్పగా,అతను షాక్‌ అవుతాడు. 

అనంతరం తన ఫ్యామిలీ రచ్చ చూపించాడు. నితిక్‌కి డాడీ రావు రమేష్‌. అరేయ్‌ నువ్వు ఆఫ్ట్రాల్‌ జూ ఆర్టిస్ట్ వి, అంటే ఎక్ట్స్ గాడివి, ఒక ఆర్డినరీ మ్యాన్‌కి ఎందుకురా ఇన్ని ఎక్స్ ట్రాలు అని తిట్టగా, అలా సింగిల్‌ సింగిల్‌గా కాకుండా, మింగిల్‌ చేసి చూడు నాన్న అని ఎక్స్ ట్రా, ఆర్డినరీ, ఎక్స్ ట్రా ఆర్డినరీ అని టైటిల్‌ని న్యాయం చేసేలా చెప్పడం ఆకట్టుకుంది. ఇక చివరగా,కొడుకు.. చెత్తనా కొడుకు అంటూ చెతబుట్టని రావు రమేష్‌ తన్నడం టీజర్‌లో హైలైట్‌గా నిలచింది. ఈ సినిమాని డిసెంబర్‌ 8న రిలీజ్‌ చేయబోతున్నట్టు టీమ్‌ స్పష్టం చేసింది. మొత్తంగా టీజర్‌ ఫన్నీగా అలరించేలా ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios