యంగ్ హీరో నితిన్ అ..ఆ.. తర్వాత అంతటి విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. కానీ నితిన్ గత ఏడాది నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం రెండు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీనితో నితిన్ తదుపరి చిత్రం కోసం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. నితిన్ నెక్స్ట్ మూవీ ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉండబోతోంది. ఆ తర్వాత నటించబోయే రెండు చిత్రాలని కూడా నితిన్ ఖరారు చేశాడు. 

ఛల్ మోహన్ రంగ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రంలో, చందు ముండేటి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో ఆసక్తికర ప్రాజెక్ట్ కి నితిన్ అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ తొలి ప్రేమ ఫేమ్ వెంకీ చెప్పిన ఓ లవ్ స్టోరీకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వీరిద్దరి కాంబినేషన్ లో రొమాంటిక్ ప్రేమ కథ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి వినిపించిన కథ కీర్తికి కూడా నచ్చేసిందట. అందుకే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపిందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. నితిన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టగా, కీర్తి సురేష్ పలు చిత్రాలతో బిజీగా ఉంది.