ఏదో ఒక విభిన్నత లేకపోతే జనం ఆదరించటం లేదు. ఇది ఇప్పుడు హీరోలకు అగ్ని పరీక్షగా మారింది. సినిమా తీసి రిలీజ్ చేయటం ఒకెత్తు అయితే మారుతున్న ప్రేక్షకుల పల్స్ పట్టుకోవటం, ట్రెండ్ లో ఉండటం దర్శకుడికే కాదు...హీరోకు ప్రతీ సారీ క్వచ్చిన్ మార్కే. 

అందుకోసం కొత్త తరహా కథలను ఎంచుకోవటం, సాధ్యమైనంత వైవిధ్యాన్ని చూపటం చేస్తున్నారు. ఇప్పుడు నితిన్ కూడా అదే బాటలో ప్రయాణం పెట్టుకున్నారు. శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ కు ఏ సినిమా చేయాలో అర్దం కాని సిట్యువేషన్ ఏర్పడింది. హిట్ డైరక్టర్ ని పెట్టుకున్నా హిట్ ఇవ్వటం లేదు. దాంతో కథలనే నమ్ముకోవాలని డిసైడ్ అయ్యారు.   

అందులో భాగంగా  నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా చేస్తున్నాడు. అలాగే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. వీటితో పాటు దర్శకుడు కృష్ణచైతన్యతో ఓ వైవిధ్యమైన సినిమా చేయబోతున్నాడు.  దర్శకుడు కృష్ణచైతన్య. లిరిసిస్టుగా పరిచయం అయి.. ‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న కృష్ణచైతన్య ఇంతకుముందు నితిన్‌తో ‘ఛల్ మోహన్ రంగ’ తీశాడు. అది నిరాశ పరిచింది. 

మూడు భాగాలుగా వచ్చే ఈ సినిమా తొలి భాగానికి ‘పవర్ పేట’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకూ తెలుగులో మూడు భాగాలతో ఏ సినిమా కూడా రాలేదు. తమిళంలో ధనుష్ అటువంటి ప్రయోగం రీసెంట్ గా చేసి ప్రూవ్ చేసుకున్నారు. 

ఇక టైటిల్ విషయానికి వస్తే...నితిన్‌కు పవన్‌కళ్యాణ్ అంటే వీరాభిమానం. అందుకే పవర్‌స్టార్ గుర్తుకు వచ్చేలా ‘పవర్ పేట’ అని టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. భీష్మ, చంద్రశేఖర్ యేలేటి చిత్రాలు పూర్తి చేసిన తర్వాత ‘పవర్‌పేట’ చిత్రం చేస్తాడు నితిన్. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ నిర్మిస్తుంది.