కాన్సెప్ట్ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం బిజినెస్ బాగా జరిగిందని సమాచారం. థియేటర్లలో 100 శాతం సీటింగ్‌ కెపాసిటీకి కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వడం, అలాగే టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సమ్మతించడంతో డిస్ట్రిబ్యూటర్లకు మంచి రేటే పెట్టి కొనుక్కున్నారని తెలుస్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు రూ.15 కోట్లు తీసుకున్నారని సమాచారం. నైజాం రైట్స్‌ను వరంగల్ శ్రీను రూ.5 కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు. ఈ రూ.15 కోట్లతో పాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా నిర్మాతకు మరో రూ.12 కోట్లు వసూలైందట. అంటే  ఈ సినిమా నిర్మాతకు సేఫ్ వెంచర్ అని చెప్తున్నారు.
 
ఈ చిత్రం ట్రైలర్ చూసిన వారు.. బి, సి ఏరియాల్లో పెద్దగా ప్రభావం చూపించదు అని, బిజినెస్ పెద్దగా కాదని అంచనా వేశారు. కానీ, వారి లెక్కలు తప్పాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆ అంచనాలను దాటేసింది. ‘చెక్’ సినిమా థియేట్రికల్ హక్కులు మంచి ధరలకు అమ్ముడుపోవటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

చంద్రశేఖర్‌ యేలేటి మాట్లాడుతూ ‘‘ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ కథ ఇది. చదరంగం నేపథ్యంలో సాగుతుంది. నితిన్‌ బాగా నటిస్తున్నారు.’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘నితిన్‌ ఇంతవరకు ఇలాంటి పాత్ర చేయలేదు. నటన పరంగా ఆయన విశ్వరూపం ఈ చిత్రంలో కనిపిస్తుంది. ప్రియా వారియర్‌కి ఇదే తొలి తెలుగు చిత్రం. ’’ అన్నారు.  పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్‌ తదితరులు నటిస్తున్నారు. 

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్  కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. ట్రైలర విడుదల తర్వాత దీనిపై ఎక్సపెక్టేషన్స్ బాగా పెరిగాయి. వాటిని తప్పకుండా అందుకుంటుందీ చిత్రం’’ అన్నారు నిర్మాత . ఛాయాగ్రహణం: రాహుల్‌   శ్రీవాత్సవ్‌, సంగీతం: కల్యాణి మాలిక్‌, కళ: వివేక్‌ అన్నామలై.