త్రిషకి మద్దతుగా సెలెబ్రిటీలంతా స్పందిస్తూ మన్సూర్ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ జాబితాలోకి తాజాగా హీరో నితిన్ చేరారు.
దళపతి విజయ్ నటించిన లియో చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై పర్వాలేదనిపించింది. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటించింది. ఇద్దరూ భార్య భర్తలుగా అద్భుతంగా నటించి మెప్పించారు.
లియో చిత్రంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆంటోని దాస్ గ్యాంగ్ లో కీలక వ్యక్తిగా.. లియోకి అనుచరుడిగా మన్సూర్ నటించారు. రీసెంట్ గా మన్సూర్ అలీ ఖాన్ త్రిషని ఉద్దేశించి తీవ్ర అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారుతోంది.
లియో చిత్రంలో త్రిషని రేప్ చేసే అవకాశం రాలేదు అంటూ నిరాశ పడుతున్నట్లు వ్యాఖ్యలు చేశాడు. త్రిష ఈ చిత్రంలో నటిస్తుంది అని చెప్పినప్పుడు ఆమెతో బెడ్ రూమ్ లో రేప్ సీన్ ఉంటుందని భావించా. చాలా చిత్రాల్లో నేను రేప్ సన్నివేశాల్లో నటించా. నాకేమి కొత్త కాదు. త్రిషని నా చేతులతో బెడ్ రూమ్ లోకి ఎత్తుకెళ్లే సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ ఈ చిత్రంలో నాకు త్రిషతో అసలు సన్నివేశాలే లేవు అంటూ వెకిలి నవ్వుతూ కామెంట్స్ చేశాడు.
దీనితో త్రిషకి మద్దతుగా సెలెబ్రిటీలంతా స్పందిస్తూ మన్సూర్ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ జాబితాలోకి తాజాగా హీరో నితిన్ చేరారు. త్రిషకి మద్దతుగా నితిన్ కామెంట్స్ చేస్తూ.. త్రిషపై మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో చోటు లేదు. మహిళలకు వ్యతిరేకంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలని ప్రతి ఒక్కరూ ఖండించాలి అని నితిన్ పోస్ట్ చేశాడు. నితిన్, త్రిష జంటగా గతంలో అల్లరి బుల్లోడు అనే చిత్రంలో నటించారు.