పుష్ప 2, గేమ్ ఛేంజర్ చిత్రాల వల్ల రాబిన్ హుడ్ నలిగిపోయే పరిస్థితి ఏర్పడింది. పుష్ప 2 డిసెంబర్ 6కి రానుంది. గేమ్ ఛేంజర్ క్రిస్టమస్ రిలీజ్ అని ప్రకటించారు.
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ రాబిన్ హుడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. నితిన్ పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. నితిన్ సాలిడ్ హిట్ అందుకుని చాలా కాలం అవుతోంది. కాబట్టి రాబిన్ హుడ్ పై ఆశలు పెట్టుకున్నాడు. మంచి ఎంటర్టైనింగ్ కథతో మ్యాజిక్ చేయడం వెంకీ కుడుముల స్టైల్. వెంకీ కుడుముల మ్యాజిక్ చేస్తే ఒక హిట్ వస్తుందని నితిన్ భావిస్తున్నాడు.
ఈ చిత్రం నితిన్ మార్కెట్ తో పోల్చితే భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోందట. దాదాపు 70 కోట్ల బడ్జెట్ ని టాక్ వినిపిస్తోంది. ముందు నుంచి డిసెంబర్ రిలీజ్ అని చెబుతుండడంతో ఆ దిశగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పుష్ప 2, గేమ్ ఛేంజర్ చిత్రాల వల్ల రాబిన్ హుడ్ నలిగిపోయే పరిస్థితి ఏర్పడింది.
పుష్ప 2 డిసెంబర్ 6కి రానుంది. గేమ్ ఛేంజర్ క్రిస్టమస్ రిలీజ్ అని ప్రకటించారు. ఈ రెండు చిత్రాల మధ్యలో రిలీజ్ అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. దీనితో రాబిన్ హుడ్ ని వచ్చే ఏడాది ఫిబ్రవరికి పోస్ట్ ఫోన్ చేయాలని చూస్తున్నారు. అయితే ఫిబ్రవరిలో నితిన్.. దిల్ రాజు నిర్మాణంలో నటిస్తున్న తమ్ముడు రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. అప్పుడు కనుక రాబిన్ హుడ్ రిలీజ్ అయితే తమ్ముడు చిత్రానికి కొత్త డేట్ వెతుక్కోవాల్సి ఉంటుంది.
మొత్తంగా నితిన్ కి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి మారింది. పుష్ప 2 పై రూమర్స్ వస్తున్నాయి. అదే కనుక నిజమై పుష్ప వాయిదా పడితే రాబిన్ హుడ్ కి పండగే. డిసెంబర్ లోనే రావచ్చు. ఏదైనా పుష్ప 2 నిర్ణయం నితిన్ కి కీలకంగా మారింది.
