నితిన్ నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంపై క్రమంగా బజ్ పెరుగుతోంది. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి చేసిన ప్రచార కార్యక్రమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
నితిన్ నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంపై క్రమంగా బజ్ పెరుగుతోంది. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి చేసిన ప్రచార కార్యక్రమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సాంగ్స్ కి యూట్యూబ్ లో అద్భుతమైన స్పందన వస్తోంది. టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజగా మాచర్ల ధమ్కీ పేరుతో చిన్న టీజర్ రిలీజ్ చేశారు. నితిన్ పవర్ ఫుల్ డైలాగ్, యాక్షన్ కట్స్ తో టీజర్ అదిరింది. 'మహాభారతంలో ధర్మాన్ని కాపాడడం కోసం లక్షలాది మంది తమ సమాధులని పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడడం కోసం నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం' అంటూ నితిన్ చెబుతున్న డైలాగ్ సినిమా థీమ్ గురించి హింట్ ఇస్తోంది.
టీజర్ లో నితిన్ జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డి ఐఏఎస్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. టీజర్ లో చూపిన యాక్షన్ కట్స్ మాస్ ప్రేక్షకులని మెప్పించేలా ఉన్నాయి. ఇక థియేట్రికల్ ట్రైలర్ ని జూలై 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
మాచర్ల నియోజకవర్గం చిత్రం ఆగష్టు 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. పొలిటికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గంపై మంచి అంచనాలు ఉన్నాయి. నితిన్ సరసన ఈ చిత్రంలో కేథరిన్, కృతి శెట్టి నటిస్తున్నారు. తెలుగు బ్యూటీ అంజలి ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది.

