Asianet News TeluguAsianet News Telugu

నితిన్ స్పీడ్ మామూలుగా లేదుగా!

హిందీ హిట్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. నితిన్ మొదటిసారి గుడ్డివాడి పాత్ర చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ కావడం జరిగింది. 

nithiin latest movie maestro completes its shoot ksr
Author
Hyderabad, First Published Jun 20, 2021, 12:30 PM IST

భీష్మతో సూపర్ హిట్ కొట్టిన నితిన్ సంతోషం చెక్, రంగ్ దే పరాజయాలతో ఆవిరైంది. కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ వరుస ప్లాప్స్ నితిన్ ని ఇబ్బంది పెడుతున్నాయి. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా నితిన్ మాత్రం ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటున్నారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేసిన చెక్ మూవీ ఈ కోవకే చెందుతుంది. కాగా నితిన్ నటిస్తున్న మరో విభిన్నం చిత్రం మాస్ట్రో. 


హిందీ హిట్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. నితిన్ మొదటిసారి గుడ్డివాడి పాత్ర చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ కావడం జరిగింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. లాక్ డౌన్ సమయంలో కూడా ధైర్యం చేసి షూట్ జరిపారు నితిన్. షూటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోనుంది మాస్ట్రో. 


తెలంగాణా రాష్ట్రంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. దీనితో నితిన్ మాస్ట్రో థియేటర్స్ లో దిగడానికి సిద్ధం అవుతున్నట్లు ఉంది. మరోవైపు మాస్ట్రో ఓటిటి లో విడుదల చేస్తారంటూ వార్తలు రావడం జరిగింది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హీరోయిన్ తమన్నా నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్ చేయడం విశేషం. మాస్ట్రో చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios