Asianet News TeluguAsianet News Telugu

Extra Ordinary Man OTT : ఓటీటీలోకి వచ్చేసిన నితిన్ ‘ఎక్ట్సా ఆర్డినరీ మ్యాన్’.. ఎక్కడ చూడొచ్చంటే?

నితిన్ - శ్రీలీలా లేటెస్ట్ ఫిల్మ్ ‘ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్’ Extra Ordinary Man OTTలోకి వచ్చేసింది. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.. ఎక్కడ చూడొచ్చనే విషయాలు తెలుసుకుందాం..

Nithiin Extra Ordinary Man movie now in Ott  NSK
Author
First Published Jan 20, 2024, 9:55 AM IST | Last Updated Jan 20, 2024, 9:55 AM IST

టాలీవుడ్ హీరో నితిన్ Nithiin - యంగ్ సెన్సేషన్ శ్రీలీల Sreeleela జంటగా నటించిన సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు.. డిఫరెంట్ టైటిల్ తో రూపొందిన ఈమూవీని వక్కంతం వంశీ డైరెక్ట్ చేశారు. గతేడాది డిసెంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ కు మంచి సక్సెస్ అందిస్తుందనుకుంటూ   ఫలితం బెడిసి కొట్టింది. 

థియేటర్ల వద్ద ఆడియెన్స్ నుంచి ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేదని తెలుస్తోంది. కానీ నితిన్ పెర్ఫామెన్స్, శ్రీలీలా ఎనర్జీ, కామెడీ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. 

ఇక తాజాగా ‘ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ Disney  Plus Hotstar దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ ముగియడంతో ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 19 నుంచే ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటోంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios