నితిన్, శ్రీలీల ఇద్దరూ పర్ఫెక్ట్ సింక్ లో డ్యాన్స్ అదరగొట్టేశారు. ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. కంప్లీట్ సాంగ్ డిసెంబర్ 4న రిలీజ్ చేయనున్నారు.

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. నితిన్ సరసన క్రేజీ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. డిసెంబర్ 8న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో జోరుగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా కంప్లీట్ ఫన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. 

ఈ చిత్రం నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్ పెంచుతూనే ఉంది. ఈ చిత్రంలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా ఫన్నీ రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ఒలె ఒలె పాపాయి అనే డ్యాన్స్ నంబర్ ప్రోమో రిలీజ్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కిన ఏ సాంగ్ థియేటర్స్ లో మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. 

నితిన్, శ్రీలీల ఇద్దరూ పర్ఫెక్ట్ సింక్ లో డ్యాన్స్ అదరగొట్టేశారు. ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. కంప్లీట్ సాంగ్ డిసెంబర్ 4న రిలీజ్ చేయనున్నారు. కలర్ ఫుల్ సెట్స్ లో, కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ లో నితిన్ , శ్రీలీల జోడి చాలా అందంగా కనిపిస్తున్నారు. 

YouTube video player

ధమాకా తర్వాత శ్రీలీల డ్యాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. కానీ ఆ రేంజ్ లో ఆకట్టుకునే డ్యాన్స్ నంబర్ శ్రీలీల చేయలేదు. స్కంద చిత్రంలో పాటలు కూడా అంతగా పేలలేదు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలోని ఈ సాంగ్ తప్పకుండా థియేటర్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.