Bigg Boss Telugu 7: నామినేషన్స్ లిస్ట్ లీక్... ఆ 8 మంది హౌస్ మేట్స్ లో ఒకరు అవుట్!
9వ వారానికి సంబంధించిన నామినేషన్స్ లిస్ట్ లీక్ అయ్యింది. ఈ వారం 8 మంది హౌస్ మేట్స్ నామినేట్ అయినట్లు సమాచారం. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

బిగ్ బాస్ షో 9వ వారంలో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక రోజ్, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఏడుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. వీరిలో రతిక రోజ్ మాత్రం రీఎంట్రీ ఇచ్చింది. ఇక 8వ వారం సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. శోభా శెట్టి-సందీప్ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లోకి వచ్చారు. ఉత్కంఠ మధ్య సందీప్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
ఇంటి సభ్యుల మీద తనకున్న పాజిటివ్, నెగిటివ్ ఒపీనియన్స్ చెప్పి సందీప్ బిగ్ బాస్ వేదిక వీడాడు. ఇక సోమవారం వచ్చిందంటే నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. 9వ వారం నామినేషన్స్ లిస్ట్ లీకైంది. 8 మంది లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. తేజ, అమర్ దీప్, శోభ, ప్రియాంక, భోలే, రతిక, యావర్, అర్జున్ నామినేట్ అయ్యారట. వీరిలో ఒకరు హౌస్ వీడనున్నారనేది సమాచారం.
శివాజీ, పల్లవి ప్రశాంత్, అశ్విని నామినేషన్స్ లోకి రాలేదని అంటున్నారు. మరి అదే జరిగితే... ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ నడుస్తుంది. హౌస్లో నలుగురు లేడీ కంటెస్టెంట్స్ ఉండగా వారిలో ముగ్గురు నామినేషన్స్ లో ఉన్నారు.
లిస్ట్ ఖచ్చితంగా ఇదే అయితే శోభా-రతికలకు తక్కువ ఓట్లు పడే సూచనలు కలవు. వీరిద్దరి మీద ఆడియన్స్ లో ఎక్కువ నెగిటివిటీ నడుస్తుంది. రతిక రీ ఎంట్రీ ఇవ్వకూడదని ప్రేక్షకులు, హౌస్ మేట్స్ కోరుకున్నారు. కానీ బిగ్ బాస్ ఉల్టా ఫల్టా నిర్ణయంతో రతికకు ఛాన్స్ వచ్చింది. ఇక శోభా ఈ వారమే ఎలిమినేట్ కావాల్సింది. కొద్దిలో మిస్ అయ్యింది. కాబట్టి నెక్స్ట్ వారం ఎలిమినేషన్ కత్తి వీరిద్దరిపై వేలాడే అవకాశం కలదు.