సునీల్ సరసన కృష్ణాష్టమి, మలుపు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన నిక్కీ గ్రిలాని కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. అయితే ఇప్పటికే రిజల్ట్ వచ్చి కొద్ది రోజులు అయ్యింది. ఆమె కరోనా నుంచి రికవరీ అవుతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తాజాగా అందరికి తెలియచేసింది.

ఈ 28 సంవత్సరాల నటి తనకు క్రితం వారం కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని, చెన్నై సిటీలోని హెల్త్ వర్కర్స్ అందరికీ ధాంక్స్ అంటూ వారిని ఎడ్రస్ చేసింది. నేను అదృష్టవంతురాలిని, ఇంట్లోనే ఉంటూ క్వరంటైన్ నియమాలు పాటిస్తున్నాను. ఇది కొంత ఇబ్బందికరమైన అనుభవమే  అని తెలుసు, నేనే కాదు, నా తోటి వాళ్లందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. నా వయస్సుకు నా విధమైన ఇతర అనారోగ్య సమస్యలు లేవు. దీని నుంచి త్వరలోనే బయిటపడతాను, కానీ మా తల్లి తండ్రులు, పెద్దవాళ్లు,నా స్నేహితులు గురించే నా బెంగ అంతా,”  అంటూ చెప్పుకొచ్చారామె.
 
నిక్కి తెలుగులో సునీల్ నటించిన కృష్ణాష్టమి సినిమాలో నటించింది. ఆతరవాత తమిళ్ లో  సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం లారెన్స్ నటిస్తున్న రంగస్థలం  తమిళ్ రీమేక్ లో సమంత  పాత్రలో  నిక్కీ నటిస్తుంది.