Asianet News TeluguAsianet News Telugu

హాట్ టాపిక్ : హీరో నిఖిల్ ట్వీట్... నరేంద్రమోడీకి ఝలక్‌

ఈ మద్యన సెలబ్రెటీలు సామాజిక అంశాలు...మన దేశంలో జరుగుతున్న అనేక విషయాల మీద సోషల్ మీడియా వేదికదా స్పందిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంటున్నారు.

nikhil tweet on on sardhar patel statue
Author
Hyderabad, First Published Nov 1, 2018, 9:27 AM IST

ఈ మద్యన సెలబ్రెటీలు సామాజిక అంశాలు...మన దేశంలో జరుగుతున్న అనేక విషయాల మీద సోషల్ మీడియా వేదికదా స్పందిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంటున్నారు. అయితే సాధారణంగా ప్రభుత్వాన్ని విమర్శించటం కానీ రాజకీయనాయకుల జోలికి  పోరు. కానీ నిఖిల్ తన మనస్సులో ఉన్నది చెప్పాలనుకున్నాడో ఏమో కానీ ఓ అడుగు ముందుకేసాడు.

తాజాగా   సోషల్‌ మీడియా వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఝలక్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. భారతదేశ ప్రప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అని పిలుస్తున్నారు. ఈ విగ్రహ నిర్మాణ వ్యయం రూ. 3,000 కోట్లు. ఈ ఖర్చు చూసిన చాలా మంది "స్టాట్యూ ఆఫ్ యూనిటీ"   ప్రజాధన దుర్వినియోగమేనని వ్యాఖ్యానించారు.

ఇంత పెద్ద మొత్తాన్ని మరేదైనా ఉపయోగకర కార్యక్రమాలకు ఖర్చు చేస్తే బాగుండేదని సోషల్ మీడియాలో, మీడియాలో విమర్శలు వచ్చాయి. అదే విషయాన్ని నిఖిల్ కూడా అందిపుచ్చుకున్నారు. ఆయన ఈ విషయమై ఓ ట్వీట్ చేసారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ని గౌరవించాల్సిందేనంటూ, ఒకవేళ ఆయన జీవించి వుంటే తన విగ్రహం కోసం చేసే ఖర్చుని ఆమోదిస్తారా.? అని ప్రశ్నించాడు.  ఈ ట్వీట్ వైరల్ అయ్యింది.. చాలా రెస్పాన్స్ వస్తోంది. 

ఈ ట్వీట్ పై బీజేపీ మద్దతుదారులేమో నిఖిల్‌పై మండిపడ్తూ.. 'సినిమాలు చేసుకోక...నీకెందుకు రాజకీయాలు.?' అంటూ ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొంతమంది, 'నీలాంటి యూత్  ఇలాగే నిలదీయాలి..' అంటూ నిఖిల్‌ని ప్రోత్సహిస్తూ రీ ట్వీట్‌లు వేసేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios