Asianet News TeluguAsianet News Telugu

యాక్షన్ కు సిద్ధం.. ‘స్వయంభు’ నుంచి సూపర్ అప్డేట్.. వియాత్నంలో ల్యాండ్ అయిన నిఖిల్.!

యంగ్ హీరో నిఖిల్ భారీ చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. ఆయన లైనప్ లోని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘స్వయంభు’ నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మేరకు వియాత్నంలో ల్యాండ్ అయిన తర్వాత ఓ వీడియోను పంచుకున్నారు. 
 

Nikhil Siddhartha Swayambhu Movie Latest Update NSK
Author
First Published Sep 7, 2023, 2:42 PM IST | Last Updated Sep 7, 2023, 2:44 PM IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)  వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ‘కార్తీకేయ2’ భారీ సక్సెస్ తర్వాత ఆయన లైనప్ షాకింగ్ గా ఉంది. ఏకంగా ఐదు ప్రాజెక్ట్స్ ను లైన్ పెట్టారు. రీసెంట్ గానే ‘స్పై’ చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఫలితానివ్వలేకపోయింది. దీంతో నెక్ట్స్ రాబోయే సినిమాలపై మరింత శ్రద్ధ పెట్టారు. 

ఈ క్రమంలో నిఖిల్ నటిస్తున్న భారీ పీరియడ్ మైథలాజికల్ యాక్షన్ ఫిల్మ్ ‘స్వయంభు’ (Swayambhu) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను, అప్డేట్స్ ను కూడా అందించిన విషయం తెలిసిందే. యుద్ధవీరుడిగా నిఖిల్ అలరించబోతున్నారు. భరత్ క్రిష్ణమాచారారి దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రం భువన్, శ్రీకర్ నిర్మాతలుగా ఫిక్సెల్ స్టూడియో బ్యానర్లో రూపుదిద్దుకుంటోంది. 

ఈ భారీ హిస్టారికల్ ఫిల్మ్ లో సిద్ధార్థ్ వారియర్ గా కనిపించబోతున్నారు. అందుకు యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు నిఖిల్. దీంతో తాజాగా వియాత్నం చేరుకున్నారు. స్వయంభూని సిద్ధం చేయడానికి 
ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి వాటిలో ట్రైయిన్ తీసుకోనున్నట్టు తెలిపారు. బిగ్ స్టంట్ మాస్టర్లతో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ శిక్షణ అనంతరం నేరుగా సెట్స్ లో అడుపెట్టబోతున్నారు. 

ఈ చిత్రానికి  టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. దర్శకుడు, మేకర్స్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ చూస్తుంటే  ఈ విషయం అర్థమవుతోంది. హిస్టారికల్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. రవి బర్సూర్ సంగీతం అందిస్తుండటం విశేషం. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మేకర్స్ ఈ చిత్రానిన్ని 2023 నవంబర్ లోనే విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios