ఓ  రేంజ్ లో ఈ సినిమాపై  ఎక్స్ పెర్టేషన్స్ ఉండటంతో ఓపినింగ్స్ బాగా వచ్చి, వీకెండ్ హౌస్ ఫుల్స్ అవుతాయని భావిస్తున్నారు.  సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ ను ...


గత సంవత్సరం కార్తికేయ 2 చిత్రం తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు నిఖిల్. ఆ సినిమా తర్వాత డిసెంబర్ లో వచ్చిన 18 పేజెస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. సుకుమార్ రైటింగ్స్ అన్నా పట్టించుకోలేదు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన సినిమా స్పై. కెరియర్ లోనే మొదటిసారి నిఖిల్ గూఢచారిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని సైతం విడుదల చేశారు. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా రాబోతున్నారు. ఈ క్రేజ్ చిత్రం ప్రీ రిలీజ్ ఊపందుకుంది. ఆ లెక్కలు చూద్దాం.

 కార్తికేయ2(Karthikeya2) సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావటం తో టోటల్ రన్ లో ఏకంగా 121 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాస్ మూవీ గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో స్పై మూవీ బిజినెస్ అదిరిపోతుందని అందరూ ఊహిస్తారు. అయితే మరీ భారీ లెవల్ లో బిజినెస్ ను చేయకుండా రీజనబుల్ బిజినెస్ తో అన్ని ఏరియాలలో దూసుకు పోతూ ఉంది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు స్పై తెలుగు వెర్షన్ థియేటర్ బిజినెస్ క్లోజ్ అయ్యింది. ఈ చిత్రం 17 కోట్లు ప్రపంచ వ్యాప్త బిజినెస్ చేసిందని సమాచారం. కార్తికేయ2 సినిమా ఆంధ్ర రీజన్ లో మొత్తం మీద… 6 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేయగా ఇప్పుడు స్పై మూవీ కూడా ఇదే రేంజ్ లో ఇక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. తెలంగాణా తో కలిపి 13 నుంచి 14 కోట్ల మధ్య ప్రీ రిలీజ్ బిజినెస్ జరగింది. మిగతా ఏరియాలు కలిపి మొత్తం 16 నుంచి 17 కోట్ల బిజినెస్ ఓవరాల్ గా తెలుగు వెర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు చెప్తున్నారు. 17 కోట్లు దాటితే ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే. మిగిలిన భాషలు, ఏరియాల బిజినెస్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది.

ఓ రేంజ్ లో ఈ సినిమాపై ఎక్స్ పెర్టేషన్స్ ఉండటంతో ఓపినింగ్స్ బాగా వచ్చి, వీకెండ్ హౌస్ ఫుల్స్ అవుతాయని భావిస్తున్నారు. సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఈ టార్గెట్ ను త్వరగానే అందుకుని మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంది.

 ఆజాద్ హిందూ ఫౌజ్ సృష్టికర్త సుభాష్ చంద్రబోస్ విమానం ప్రమాద మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా రానుంది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఈ సినిమా రాపోతోంది. ఐశ్వర్య మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమా జూన్ 29న గ్రాండ్గా విడుదల కానుంది. ఇక ట్రైలర్ లో చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెపుతూ.. చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు దాస్తుంది ..దానికి సమాధానం మనమే వెతకాలి అంటోంది ఈ చిత్రం.