నిఖిల్ చెప్పిన స్వయంభు విశేషాలు.. వియత్నాంలో ఒళ్ళు హూనం చేసేశారు
కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ కి స్పై చిత్రంతో ఎదురుదెబ్బ తగిలింది. అయితే నిఖిల్ ఆ చిత్రం నుంచి త్వరగా బయటకి వచ్చి తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు.

కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ కి స్పై చిత్రంతో ఎదురుదెబ్బ తగిలింది. అయితే నిఖిల్ ఆ చిత్రం నుంచి త్వరగా బయటకి వచ్చి తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. నిఖిల్ తదుపరి చిత్రాల లైనప్ మామూలుగా లేదు.
నిఖిల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం స్వయంభు. ఈ మూవీ వెయ్యేళ్ళ క్రితం నాటి పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతోంది. నిఖిల్ కెరీర్ లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో నిఖిల్ వారియర్ గా నటిస్తున్నాడు.
తాజాగా ఇంటర్వ్యూలో స్వయంభు గురించి ఆసక్తికర విశేషాలని నిఖిల్ పంచుకున్నాడు. స్వయంభు ఆ తర్వాత రాంచరణ్ నిర్మాణంలోని చిత్రం ఆ తర్వాత కార్తికేయ 3 ఉంటుందని నిఖిల్ తెలిపారు. నా జీవితంలో నేను కత్తి పట్టుకోలేదు. హార్స్ రైడింగ్ చేయలేదు. స్వయంభులో అవన్నీ చేయాలి.
దీనికోసం వియత్నాం వెళ్లి 45 రోజులపాటు ట్రైనింగ్ తీసుకున్నా. అక్కడ అద్భుతమైన స్టంట్ మాస్టర్స్ ఉన్నారు. నా ఒళ్ళు హూనం చేసేశారు.ఈ కష్టం మొత్తం మీరు సినిమాలో చూస్తారు. ఇప్పటికే ఈ మూవీ కోసం భారీ సెట్లు వేస్తున్నట్లు నిఖిల్ తెలిపారు.
సినిమాలో ఏదో ఒక హై, గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతే జనాలు థియేటర్స్ కి రావడం లేదు. ఇక కార్తికేయ 2 తర్వాత నాపై పెరిగిన అంచనాలకు తగ్గట్లుగానే నేను కూడా కష్టపడుతున్నా అని నిఖిల్ తెలిపారు. స్వయంభు చిత్ర షూటింగ్ మూడు నెలలు గడిచాక రాంచరణ్ నిర్మాణంలోని ప్రీ ఇండిపెండెన్స్ అడ్వెంచర్ మూవీ ఇండియా హౌస్ మొదలవుతుందని తెలిపాడు. స్వయంభు చిత్రం కోసం నిఖిల్ కంప్లీట్ డిఫెరెంట్ గెటప్, మేకోవర్ లో కనిపించబోతున్నాడు.