నిఖిల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా  ప్రారంభమై చాలా కాలం అయినా రిలీజ్ కు రెడీ అవటం లేదు. ఈ సిననిమా ‘ముద్ర’ టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ మరో నిర్మాత నట్టికుమార్ ఈ మధ్యనే ఇదే టైటిల్ తో జగపతిబాబు హీరోగా ఓ సినిమా రిలీజ్ చేసారు. దాంతో  టైటిల్‌పై జరిగిన పోరులో హీరో నిఖిల్‌ కాస్త వెనక్కితగ్గి.. టైటిల్ ని   ‘అర్జున్‌ సురవరం’ అని మార్చేశాడు. అయితే సమస్యలు అక్కడితో పోలేదు.  తాజాగా తన చిత్రానికి సంబంధించిన మరో సమస్య టీమ్ ని ఇబ్బంది పెడుతోందని తెలుస్తోంది. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఈ చిత్రం ఎడిటింగ్ పూర్తి అయ్యి ఫైనల్ వెర్షన్ చూసుకున్నాక సంతృప్తి చెందలేదట. ఎడిటర్ నవీన్ నూలి తను అనుకున్నట్లు ఎడిట్ చేయలేదని డైరక్టర్ ఫీల్ అయ్యారట. తమిళ ఒరిజనల్ ని ఎడిటింగ్ చేసిన భువన శ్రీనివాసన్ ని తీసుకొచ్చి ఎడిటింగ్ చేయించాలని పట్టుపడుతున్నారట. దాంతో ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ లో టీమ్ పడిందిట. పోనీ నవీన్ నూలి తక్కువ వాడా అంటే  రీసెంట్ గా రామ్ చరణ్ రంగస్దలం కు ఎడిట్ చేసారు. 

ఇక ఈ సినిమాలో నిఖిల్‌ అర్జున్‌ లెనిన్‌ సురవరం అనే జర్నలిస్ట్‌ పాత్రలో నటించారు.  నిఖిల్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సంతోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఔరా సినిమాస్‌, మూవీ డైనమిక్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ఠాగూర్‌’ మధు సమర్పిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్‌ అరోరా, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సూర్య, సంగీతం: స్యామ్‌ సి.ఎస్‌.

సమాజంలోని సమస్యల్ని మీడియా ఎలా పరిష్కరిస్తుందో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నిఖిల్‌ ఇందులో అర్జున్‌ సురవరం అనే ఓ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి, నిఖిల్‌ జోడీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభించింది.  ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు ముగింపు దశలో ఉన్నాయి. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని నిర్మాతలు చెప్తున్నారు