యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం 'అర్జున్ సురవరం'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం పోలీస్ చేతిలో 36 సార్లు దెబ్బలు తిన్నట్లు చెప్పుకొచ్చాడు నిఖిల్. సినిమాలో ఓ సన్నివేశంలో పోలీస్ ఆఫీసర్ చేతిలో దెబ్బలు తినాలి. ఆఫీసర్ నిఖిల్ ని కొట్టే సన్నివేశాన్ని క్లోజప్ షాట్ లో తీద్దామని దర్శకుడు భావించాడు.

పోలీస్ కొట్టగానే నిఖిల్ ఫోర్స్ గా కిందపడిపోవాలి. అయితే ఈ సీన్ చేయడానికి 36 టేక్స్ తీసుకున్నట్లు నిఖిల్ చెప్పాడు. అలా షూటింగ్ లో భాగంగా పోలీస్ చేతిలో 36 సార్లు దెబ్బలు తిన్నట్లు చెప్పుకొచ్చాడు.

మరో సన్నివేశంలో లావణ్యతో చెంపదెబ్బ తినాలని.. అది మాత్రం లక్కీగా ఒక టేక్ లో పూర్తయిందంటూ గుర్తు చేసుకున్నాడు. షూటింగ్ కోసం బాగా కష్టపడ్డామని డూప్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్ చేసినట్లు వెల్లడించారు.