‘ఇక్కడ చూడండి.. కళ్లు తెరవండి’ అంటూ డాక్టర్లు సాయితేజ్‌ చేతిపై తడుతున్న వీడియో ఇటీవల బయటకు వచ్చింది. తాజాగా ఆ వీడియోపై నిఖిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నప్పుడైనా ఓ వ్యక్తి ప్రైవసీకి దయచేసి గౌరవం ఇవ్వమని ఆయన కోరారు.

ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతించారు? అంటూ నిఖిల్‌ ప్రశ్నించారు. ఈమేరకు నిఖిల్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిధరమ్‌ తేజ్‌కు చికిత్స చేస్తోన్న వీడియోలు బయటకు రావడం బాధాకరమని నిఖిల్‌ అన్నారు. శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన వెంటనే ఆయన్ని మెడికోర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి ఐసీయూలో సాయిధరమ్‌ తేజ్‌కు ప్రాథమిక చికిత్స అందించారు.

 ‘ఇక్కడ చూడండి.. కళ్లు తెరవండి’ అంటూ డాక్టర్లు సాయితేజ్‌ చేతిపై తడుతున్న వీడియో ఇటీవల బయటకు వచ్చింది. తాజాగా ఆ వీడియోపై నిఖిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నప్పుడైనా ఓ వ్యక్తి ప్రైవసీకి దయచేసి గౌరవం ఇవ్వమని ఆయన కోరారు. మరోవైపు, నాలుగు రోజుల నుంచి అపోలోలో సాయితేజ్‌ చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయికి కాలర్‌ బోన్‌ శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. చికిత్సలో భాగంగా వెంటిలేటర్‌ అవసరాన్ని తగ్గిస్తున్నామని వైద్యులు తెలిపారు. ముఖ్యమైన బయోమెడికల్ పరీక్షలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. 

ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన సూపర్ హిట్ సినిమా కార్తికేయ సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘18 పేజీస్’ సినిమాలో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్నాడు. ఈ మూవీలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే నిఖిల్ త్వరలో మరో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ప్రముఖ రచయిత కోనా వెంకట్ రాసిన ఓ కథతో నిఖిల్ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ కథ మెడికల్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఉండనుందని తెలుస్తుంది.