Asianet News TeluguAsianet News Telugu

నిఖిల్ అర్జున్ సురవరం.. వాలెంటైన్స్ డే స్పెషల్ లుక్

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్ర యూనిట్ సభ్యులు కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అర్జున్ సురవరం. 

NIKHIL ARJUN SURAVARAM POSTAR
Author
Hyderabad, First Published Feb 14, 2019, 8:41 PM IST

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్ర యూనిట్ సభ్యులు కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అర్జున్ సురవరం. 

మార్చి 29న ఈ చిత్రం విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు  ప్రకటించారు. ఇందులో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు కిర్రాక్ పార్టీతో ప్లాప్ అందుకున్న నిఖిల్ ఇప్పుడు ఎలాగైనా ఈ సినిమాతో హిట్టందుకోవాలని చూస్తున్నాడు. టిఎన్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

త్వ‌ర‌లోనే ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ సినిమాను నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర ఈ చిత్రంలో స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios