రీ రిలీజ్ కు రెడీ అయిన హ్యాపీడేస్ మూవీ, నిఖిల్ ఫన్నీ ట్వీట్ వైరల్
ఈ మధ్య రీరిలీజ్ ల ట్రెండ్ ఎక్కువ అవుతుంది. సూపర్ హిట్ మూవీస్.. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్ కు పండగ చేస్తున్నారు. ఇక ఏ స్టార్ సినిమా కకపోయినా.. ట్రెండ్ సెట్ చేసిన కొన్ని సినిమాలు కూడా రీరిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందులో హ్యాపీడేస్ కూడా ఉంది.

ఈ మధ్య రీరిలీజ్ ల ట్రెండ్ ఎక్కువ అవుతుంది. సూపర్ హిట్ మూవీస్.. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్ కు పండగ చేస్తున్నారు. ఇక ఏ స్టార్ సినిమా కకపోయినా.. ట్రెండ్ సెట్ చేసిన కొన్ని సినిమాలు కూడా రీరిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందులో హ్యాపీడేస్ కూడా ఉంది.
కొన్ని సినిమాలు స్టార్లు నటించనవసరం లేదు.. భారీ బడ్జెట్లు కూడా అవసరం లేదు. అలా నిలిచిపోతాయి అంతే.. సినీ లవర్స్‌ను ఎంతగానో అలరించిన సినిమాలలో హ్యాపీడేస్ కూడా ఒకటి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఈసినిమా.. టీవీలో వస్తేనే ఆడియన్స్ అలా టీవీలకు అతుక్కుపోతుంటారు. అటువంటిసినిమాను మళ్లీ కొన్నేళ్ల తరువాత థియేటర్ లో ప్లే చేస్తే చూడకుండ ఉటారా చెప్పండి. ఇక ఈ సినిమా అభిమానుకలకు తాజాగా అద గుడ్ న్యూస్ అందింది.
పదహారేళ్ల కిందట వచ్చిన హ్యాపీడేస్ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్‌గా మిగిలింది. కాలేజి కుర్రకారుకు ఈ సినిమా ఎంత నచ్చిందంటే.. చాలా మంది ఈ సినిమా చూసి ఇంజనీరింగ్ చేద్దామని డిసైడ్ అయ్యేంతలా. శేఖర్ కమ్ములా టేకింగ్, యాక్టర్స్ టెర్రిఫిక్ పర్మార్మెన్స్, మిక్కీ మ్యూజిక్ ఇలా చెప్పుకుంటే పోతే సినిమా గురించి ఓ పుస్తకమే రాయోచ్చు. అంతలా ఈ సినిమా జనాలకు ఎక్కేసింది. ఇక ఇలాంటి కల్ట్ సినిమాను రీ-రిలీజ్ చేస్తే సినీ లవర్స్‌లో ఉండే ఆత్రుత అంతా ఇంతా కాదు.
తాజాగా ఈసినిమాకు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హ్యాపీడేస్ మూవీని రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు యంగ్ సెన్సేషన్ నిఖిల్ సిద్దార్థ. ఈ సినిమా రీ-రిలీజ్ గురించి ఓ ట్వీట్ వేశాడు యంగ్ హీరో. హ్యాపీడేస్ డేస్ సినిమా రీ-రిలీజ్ ఒకేనా అని ఓ పోస్ట్ వేశాడు. అయితే ఈ విషయంలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. బోలెడ్ లైకులు కూడా వచ్చాయి. అయితే ఈ కామెంట్లలో ఏం పెడుతున్నారంటే.. పలువురు వేయిటింగ్ అని, గ్రేట్ ఐడియా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే ఎందుకు పాత గాయాన్ని మళ్లీ లేపుతారు. ఈ సినిమా వల్లే నా జిందగీ మన్నుల కలిసిందంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకూ ఈ సినిమాను తలతన్నే కాలేజీ డ్రామా మూవీ ఇంత వరకూ రాలేదనే చెప్పాలి. హ్యాపిడేస్ కమర్షిలయ్‌గానూ కోట్లు కొల్లగొట్టింది. కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్‌లో పది కోట్లు కొల్లగొట్టి బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలే తెచ్చిపెట్టింది. ఇక ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమా నిర్మాత కూడా శేఖర్ కమ్ములానే.