మెగాడాటర్ నీహారిక ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లలో నటించింది. ఇప్పుడు 'మ్యాడ్ హౌస్' అనే మరో వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. రీసెంట్ గా దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మ్యాపర్ ప్రెజంట్స్ పై నీహారిక స్వయంగా ఈ సిరీస్ ని నిర్మిస్తోంది.

మహేష్ ఉప్పల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నీహారిక మాట్లాడుతూ.. 'మా డైరెక్టర్ నా దగ్గరకి వచ్చి 'మ్యాడ్ హౌస్' కథ చెప్పగానే నచ్చి వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నాను. ఇన్వినీటం వారు దీన్ని కో ప్రొడ్యూస్ చేయడంతో ప్రొడక్ట్ విలువ మరింత పెరిగింది. మ్యాపర్ యాప్ వారు ఈ వెబ్ సిరీస్‌ను ప్రెజెంట్ చెయ్యడం సంతోషంగా ఉంది'' అంటూ చెప్పుకొచ్చింది.

తను గతంలో చేసిన 'నాన్నకూచి', 'ముద్దపప్పు ఆవకాయ' తరహాలోనే ఈ 'మ్యాడ్ హౌస్' కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నట్లు చెప్పింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా వస్తోన్న 'మ్యాడ్ హౌస్' కర్టెన్ రైజర్ వీడియోను ఈ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

యువత రోజూ జరిగే సంఘటనలను ఎలా ఎదుర్కొంటారు..? వారికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి..? అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుందని చెప్పుకొచ్చింది.  వంద ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నట్లు.. ప్రతీవారం ఒక ఎపిసోడ్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.