మెగా డాటర్ నిహారిక నయా అవతార్... ఈ యాంగిల్ అసలు ఊహించలేదు!
నాగబాబు తనయ నిహారిక ఇటీవల భర్తతో విడిపోయారు. విడాకులు అనంతరం ఆమె కెరీర్ పై దృష్టి పెట్టింది. నటిగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నిహారిక మరో కొత్త అవతారం ఎత్తింది.
మెగా ఫ్యామిలీ లో డేరింగ్ గర్ల్ గా ఉంది నిహారిక కొణిదెల. పట్టుబట్టి హీరోయిన్ కావాలన్న తన కోరిక నెరవేర్చుకుంది. నిహారిక ఒక మనసు చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ట్రాజిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఆ చిత్రం అంతగా ఆడలేదు. అనంతరం సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాల్లో నటించింది. అలాగే ఒకటి రెండు తమిళ చిత్రాలు కూడా చేసింది. ఒక్కటి కూడా విజయం సాధించలేదు. హీరోయిన్ గా బ్రేక్ రాకపోవడంతో... పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.
2020 డిసెంబర్ లో నిహారిక-జొన్నలగడ్డ వెంకట చైతన్య వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. కొన్నాళ్ళు వీరి కాపురంగా సవ్యంగా సాగింది. అనుకోకుండా మనస్పర్థలు తలెత్తాయి. 2023 ప్రారంభంలో అధికారికంగా విడాకులు ప్రకటించారు. నిహారిక నటించడానికి వీలు లేదని అత్తింటి వారు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో అది నచ్చని నిహారిక విడాకులు తీసుకున్నారనే వాదన ఉంది.
విడాకులు అనంతరం నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె నటిగా బిజీ అవుతున్నారు. తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ కోసం ఆఫీస్ ఓపెన్ చేసింది. డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. తాజాగా నిహారిక హోస్ట్ అవతారం ఎత్తింది. చెఫ్ మంత్ర సీజన్ కి ఆమె హోస్ట్ గా వ్యవహరించనుంది. ఈ మేరకు ప్రోమో విడుదల చేశారు. గతంలో ఎన్నడూ నిహారిక యాంకరింగ్ చేసింది లేదు.
చెఫ్ మంత్ర సీజన్ 3 కోసం ఆమె యాంకర్ గా బాధ్యతలు తీసుకుంది. ఈ కొత్త జాబ్ నిహారిక ఇలా నెరవేరుస్తారో చూడాలి. చెఫ్ మంత్ర మార్చి 3న గ్రాండ్ గా లాంచ్ అవుతుంది. కాగా నిహారిక రాజకీయాల్లోకి వస్తున్నారని పుకార్లు వినిపించాయి. వీటికి వరుణ్ తేజ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.