మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా ప్రత్యేక స్థానం పొందేందుకు ప్రయత్నిస్తోంది. పెళ్ళికి ముందు పలు చిత్రాల్లో నిహారిక నటించింది. అయితే హీరోయిన్ గా ఆమెకి అంతగా కలసి రాలేదు.
మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా ప్రత్యేక స్థానం పొందేందుకు ప్రయత్నిస్తోంది. పెళ్ళికి ముందు పలు చిత్రాల్లో నిహారిక నటించింది. అయితే హీరోయిన్ గా ఆమెకి అంతగా కలసి రాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది.
అయితే నిహారిక పర్సనల్ లైఫ్ వ్యవహారాలతో కూడా తరచుగా వార్తల్లో కెక్కుతోంది. ఆ మధ్య పబ్ వివాదంలో చిక్కుకోవడం.. ఆ తర్వాత పోలీసులు నిహారికకు క్లీన్ చిట్ ఇవ్వడం లాంటి న్యూస్ ఎలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా నిహారిక 2020లో చైతన్యని వివాహం చేసుకుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.
అయితే కొన్ని రోజులుగా నిహారిక, చైతన్య మధ్య రిలేషన్ బాగా లేదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. నిహారిక సోషల్ మీడియాలో చాలా కాలంగా చైతన్య గురించి ప్రస్తావన లేదు. అలాగే చైతన్య కూడా తన సోషల్ మీడియా నుంచి నిహారిక ఫొటోస్ డిలీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో వీరిద్దరూ విడాకుల వైపు వెళుతున్నారనే అనే షాకింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా నిహారిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆసక్తికర పోస్ట్లు పెట్టింది. డెబ్యూ దర్శకుడు సౌర్యువ్ నాని 30 చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయింది.

ఇటీవల ఈ దర్శకుడు తన పుట్టినరోజు జరుపుకున్నారు. దీనితో నిహారిక అతడికి బర్త్ డే విషెస్ చెబుతూ ఆసక్తికర ఫొటోస్ షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే సౌర్యువ్ గారు.. ఈ ఏడాది మీదే. మీ దర్శకత్వ ప్రతిభతో మమల్ని ఆశ్చర్యపరచడం ఖాయం అని కామెంట్ పెట్టింది. అలాగే షూటింగ్ లొకేషన్ నుంచి ఒక పిక్ పోస్ట్ చేసింది.

నాని 30 చిత్రంలో నిహారిక కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర లాంచ్ కార్యక్రమంలో కూడా నిహారిక పాల్గొనడం విశేషం. అలాగే తన స్నేహితురాలితో కలసి కాఫీ డేట్ కి వెళ్లిన విషయాన్ని కూడా నిహారిక పోస్ట్ చేసింది. తన పర్సనల్ లైఫ్ గురించి రూమర్స్ వస్తున్న వేళ నిహారిక ఏం పోస్ట్ చేసినా వైరల్ అవుతోంది.
