ఈ పోస్టులపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. వరుణ్, లావణ్యపై ప్రేమ కురిపిస్తూ విషెస్ తెలియజేస్తున్నారు. ఇద్దరూ చల్లగా ఉండాని దీవిస్తూ.. మీ ప్రేమ అంతరిక్షం దాకా చేరాలంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హోటల్ లో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమా షూటింగ్ ముగించుకొని నేరుగా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం విశేషం. ఆ ఫొటోలు బయిటకు వచ్చాయి. అయితే అదే పంక్షన్ లో నీహారిక భర్త చైతన్య జొన్నల గడ్డ కనిపించలేదు. ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇంటి అల్లుడు లేకుండా ఎంగేజ్మెంట్ జరిగిందా అంటున్నారు.
ఈ ఫంక్షన్ ముగిసిన వెంటనే.. ఇద్దరు కూడా తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఎంగేజ్‌మెంట్ స్టిల్స్ షేర్ చేశారు. అంతేకాదు ఈ ఫొటోలకు వరుణ్ ‘నా లావ్ దొరికింది’ అంటూ క్యాప్షన్ ఇవ్వగా.. ‘నన్ను నేను కనుగొన్నాను’ అని లావణ్య తన పోస్ట్‌కు క్యాప్షన్ జతచేసింది. ఇక ఈ పోస్టులపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. వరుణ్, లావణ్యపై ప్రేమ కురిపిస్తూ విషెస్ తెలియజేస్తున్నారు. ఇద్దరూ చల్లగా ఉండాని దీవిస్తూ.. మీ ప్రేమ అంతరిక్షం దాకా చేరాలంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్, లావణ్యకు ప్రగ్యా జైస్వాల్, లక్ష్మి మంచు, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వంటి సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెప్పారు.
వరుణ్ చెల్లెలు నిహారిక కొణిదెల హార్ట్ ఎమోజీస్‌తో రిప్లయ్ ఇచ్చింది. అయితే నిహారిక పోస్టు చూసిన నెటిజన్లు మాత్రం.. నీ భర్త ఎక్కడ అంటూ కామెంట్లో అడుగుతున్నారు. ‘నీ పెళ్లి ఎప్పుడు అక్క, లైఫ్ అంతా సింగిల్ ఉంటానని మాత్రం చెప్పకు’ అంటూ మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ విషయం ఆ కుటుబం ఊహించినట్లుంది. ఎవరూ రిప్లై ఇవ్వటం లేదు.
లావణ్య, వరుణ్ ఇప్పటి వరకు ‘అంతరిక్షం, మిస్టర్’ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ మూవీస్ చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. అంతేకాదు బెంగుళూరులో జరిగిన లావణ్య బర్త్‌డే వేడుకలో వరుణ్ అఫీషియల్‌గా తనకు ప్రపోజ్ చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ నిశ్చితార్థం జరిగే వరకు ఇద్దరు కూడా తమ రిలేషన్‌షిప్‌ను చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తూ వచ్చారు.
