నిహారిక మ్యారేజ్‌కి సంబంధించిన సందడి ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లోనే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ నెల 9న రాత్రి ఏడుగంటల సమయంలో నిహారిక మ్యారేజ్‌ చైతన్యతో జరుగబోతుంది. దీని కోసం మెగా ఫ్యామిలీ, చైతన్య ఫ్యామిలీ మార్నింగ్‌ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి బయలు దేశారు. అయితే ఇప్పుడు వారం అక్కడికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ లో వీరు సందడి చేశారు. 

ఇక ఉదయ్‌పూర్‌కి చేరుకున్న తర్వాత నిహారిక ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. కాబోయే భర్త చైతన్యతో కలిసి స్టెప్పులేసింది. ఇందులో చైతన్య సైతం కాలు కదపడం విశేషం. అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా నిహారిక డాన్స్ చేస్తూ సందడి చేసింది. పెళ్ళి విషయంలో నిహారిక ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తుంది. పెళ్ళి కళ ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం నిహారిక డాన్స్ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతుంది. 

నిహారిక పెళ్ళి కోసం చిరంజీవి, రామ్‌చరణ్‌, ఉపాసన, సురేఖ, అల్లు అర్జున్‌, స్నేహా, అల్లు అరవింద్‌, నాగబాబు, వరుణ్‌తేజ్‌తోపాటు మెగా ఫ్యామిలీ సభ్యులంతా స్పెషల్‌ ఫ్లైట్స్ లో రాజస్థాన్‌ని చేరుకున్నారు.