జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారాల్లో వేగాన్ని పెంచుతున్నారు. లోక్ సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తూ తనదైన స్పీచ్ లతో ముందుకు వెళుతున్నారు. రీసెంట్ గా పార్టీలో ఆయన సోదరుడు నాగబాబు చేరిన సంగతి తెలిసిందే. ప్రజా తీర్పును గౌరవిస్తామని అందుకే పోటీలో ఉంచినట్లు పవన్ అన్న గురించి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీగా నాగబాబు పోటీ చేయబోతున్నందున ఆయనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ ముందుకు సాగుతోంది. ముందుగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తండ్రి పార్టీలో చేరడం సంతోషంగా ఉందని బాబాయ్ తో నాన్నగారు ఎలక్షన్ పోటీలో ఉండటం మంచి పరిణామం అని వివరణ ఇవ్వగా.. చెల్లి నిహారిక కొణిదెల కూడా తండ్రి గురించి ఈ విదంగా స్పందించారు.

'నాన్న జనసేనలో చేరి నరసపురం నుండి పోటీలో నిలబడటం చాలా హ్యాపీగా ఉంది. అన్ని పార్టీల్లో కన్నా జనసేన పార్టీ నీతివంతమైన పార్టీ.. మా కళ్యాణ్ బాబాయి నాయకత్వంలో అత్యంత నీతి విలువలు గల రాజకీయ పార్టీ జనసేన ఒక్కటే.. వారికి మంచి విజయం దక్కాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా' అని నాగబాబు కూతురు తెలియజేశారు.