Asianet News TeluguAsianet News Telugu

Niharika: విదేశాల్లో మ్యారేజ్ యానివర్సరీ... చైతూతో నిహారిక చెట్టాపట్టాల్

నిహారిక (Niharika) తన మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసింది. భర్త వెంకట చైతన్యతో కలిసి ఆమె వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తన ట్రావెల్ డైరీస్ ఫ్యాన్స్ తో పంచుకుంటూ వాళ్లకు వినోదం పంచుతుంది. 
 

niharika celebrates her first marriage anniversary in spain
Author
Hyderabad, First Published Dec 9, 2021, 8:04 AM IST

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) తనయ నిహారిక పెళ్ళై సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. 2020 డిసెంబర్ 9న నిహారిక వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారి ప్రభాకర్ రావు మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో వారి అబ్బాయి వెంకట చైతన్యతో నిహారిక వివాహం జరిగింది. ఐదు రోజుల పాటు ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. మెగా హీరోలందరూ పాల్గొన్న నిహారిక వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 


కాగా నిహారిక-చైతన్య తమ మ్యారేజ్ ఫస్ట్ యానివర్సరీ (Marriage anniversary)సెలబ్రేషన్స్ కోసం స్పెయిన్ వెళ్లారు. అందమైన ప్రదేశాల్లో నిహారిక దంపతులు చక్కర్లు కొడుతున్నారు. ఈ ట్రిప్ లో నిహారిక కొన్ని సాహసాలు కూడా చేశారు. ఆమె ఏకంగా స్కూబా డైవింగ్ చేశారు. ఎక్స్పర్ట్ సహాయంతో వేల అడుగుల పైకి విమానంలో వెళ్లి.. అక్కడి నుండి దైర్యంగా డైవింగ్ చేశారు. సదరు వీడియో నిహారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఆమె సాహసాన్ని, ధైర్యాన్ని నెటిజెన్స్ మెచ్చుకుంటున్నారు. 


ఇక పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తున్నారు నిహారిక. ఆమె విజయ్ సేతుపతికి జంటగా నటించిన బైలింగ్వల్ మూవీ విడుదల కావాల్సి ఉంది. అలాగే యాంకర్ అనసూయతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. మరోవైపు నిర్మాతగా.. చిత్రాలు, సిరీస్లు నిర్మిస్తున్నారు. నిహారిక చాలా కాలం క్రితమే పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్  పేరుతో ఓ బ్యానర్ ఏర్పాటుచేశారు. ఈ బ్యానర్ లో చిన్న చిన్న సిరీస్లు ఆమె నిర్మించారు. 

Also read అకిరాలో మరో ట్యాలెంట్.. తల్లికి ఎప్పటికీ గుర్తుండి పోయే బహుమతి, పొంగిపోతున్న రేణు దేశాయ్
ఇటీవల ఈ బ్యానర్ లో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే సిరీస్ తెరకెక్కింది. జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. భర్త చైతన్యతో పాటు అత్తింటివారు నిహారికకు పూర్తి ఫ్రీడమ్ ఇవ్వగా... పెళ్లి తర్వాత కూడా నిహారిక తన అభిరుచి కొనసాగిస్తున్నారు. 

Also read డైరెక్టర్ తో ఎఫైర్.. రెండో పెళ్ళికి రెడీ అవుతున్న 7/G బృందావన కాలనీ హీరోయిన్ ?
 

Follow Us:
Download App:
  • android
  • ios