మెగా డాటర్ నిహారిక కొణిదెల - చైతన్య జొన్నలగడ్డ వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ ఘనంగా ఈ వివాహం జరిగింది. దాదాపు ఐదు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా హీరోలు అందరూ పాల్గొని సందడి చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, అల్లు అర్జున్ ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలిచారు. ఖరీదైన దుస్తులు, నగలు ధరించి రాయల్ ప్యాలస్ లో హుందాగా పెళ్ళికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం హైదరాబాద్ లో బంధు మిత్రుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 

పెళ్ళైన కొత్త జంట హనీమూన్ ప్లాన్స్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది. మొదలైన దాంపత్య బంధాన్ని ఏకాంతంగా అందమైన ప్రదేశంలో ఆస్వాదించాలని భావిస్తున్నారట. దీని కోసం హిల్ స్టేషన్స్ కో, సాగర తీరాలకో చెక్కేయాలని అనుకుంటున్నారట. ముఖ్యంగా మాల్దీవ్స్ వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరి నిహారిక, చైతన్య తమ హనీమూన్ విదేశాల్లో ప్లాన్ చేస్తారో, స్వదేశంలో ప్లాన్ చేస్తారో చూడాలి. 

ఇక కొత్త జంట నిహారిక, చైతన్య కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. వీరి క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అయ్యాయి. క్రిస్మస్ వేడుకలో అల్లు అర్జున్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.