Asianet News TeluguAsianet News Telugu

మెగా డాటర్ కొణిదెల నిహారిక నిశితార్థం..!

మెగా డాటర్ నిహారిక పెళ్ళికి సిద్ధం అయ్యారు. కొద్దిరోజుల క్రితమే నిహారిక మరియు తండ్రి నాగబాబు ఈ పెళ్లిని ధృవీకరించారు. పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో ఆమె వివాహం జరగనుంది. కాగా నిహారిక-చైతన్యల వివాహ నిశ్చితార్ధానికి ముహూర్తం కుదిరింది. 

Niharika and Chaitanya engagement held today in Hyderabad
Author
Hyderabad, First Published Aug 13, 2020, 4:13 PM IST

మెగా డాటర్ నిహారిక కొద్దిరోజుల క్రితం తనకు కాబోయేవాడిని పరిచయం చేసింది. సోషల్ మీడియాలో  నిహారిక తను కట్టుకోబోయేవాడి ఫోటోలు పంచుకోవడం జరిగింది. దీనితో నిహారిక పరిచయం చేసిన ఈ అబ్బాయి ఎవరని అప్పుడు పెద్ద చర్చే నడిచింది. గంటల వ్యవధిలో నిహారికతో రొమాంటిక్ పోజులిచ్చిన ఆ యంగ్ ఫెలో జొన్నలగడ్డ చైతన్య అని మీడియాలలో రావడం జరిగింది. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన చైతన్యను నిహారికకు భర్తగా పెద్దలు నిశ్చయించారు. 

గుంటూరు ఐజి అయిన జొన్నగడ్డ ప్రభాకర్ రావు కుమారుడే ఈ చైతన్య. ప్రభాకర్ రావు కుటుంబానికి మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుండో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రభాకర్ రావు కుటుంబంతో సన్నిత సంబంధాలున్న నేపథ్యంలో నిహారిక పెళ్లి ప్రయత్నాలలో ఉన్న నాగబాబు ఈ సంబంధం పట్ల ఆసక్తి చూపారట. ఈ పెళ్లి వెనుక పవన్ కళ్యాణ్ హస్తం కూడా ఉందని టాక్. కాగా నేడు నిహారిక-చైతన్యల వివాహ నిశ్చితార్థ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ లో బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు రాత్రి 8:00 గంటలకు నిహారిక-చైతన్య నిశ్చితార్థ ముహూర్తం. పెళ్లి కూడా త్వరలోనే అని విశ్వసనీయ సమాచారం.

ఇక మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. 2016లో వచ్చిన ఒక మనసు సినిమాతో ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాలలో నటించారు. ఓ తమిళ చిత్రం కూడా చేసిన నిహారిక, చిరంజీవి పాన్ ఇండియా చిత్రం సైరా లో గెస్ట్ రోల్ చేశారు. హీరోయిన్ గా ఆమెకు సరైన బ్రేక్ రాకపోవడంతో కెరీర్ కి గుడ్ బై చెప్పి, పెళ్ళికి సిద్ధం అయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios