రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రీసెంట్ గా సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.   ఈ సినిమాను పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ, ఛార్మి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ  సినిమాలో హీరోయిన్ నిథి అగర్వాల్  పాత్ర చాలా ఇంట్రస్టింగ్ గా ఉందని తెలుస్తోంది.  

తన పాత్ర గురించిన విషయాన్ని నిథి రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ డైలీ వద్ద చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె ఓ సైంటిస్ట్ గా కనిపించనుందని చెప్పకొచ్చింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆమె  పాత్ర హీరో పై రీసెర్చ్  చేస్తుందని , ఆ విషయం అతనికి తెలియకుండా మ్యానేజ్ చేస్తూ వెంటబడుతుందని వినికిడి.  

షెడ్యూల్ వివరాల్లోకి వెళితే..

రీసెంట్ గా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ గోవా లో శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో స్టంట్ మాస్టర్ రియల్ సతీష్ నేతృత్వంలో రామ్ , తదితరులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

ఇక ఈ చిత్రంలో రామ్ లుక్ డిఫ్రెంట్ గా ఉండనుంది. పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నఈచిత్రం మే లో విడుదలకానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , నాబా నటేష్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.