అందాల నిధి అగర్వాల్ ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతుంది. కెరీర్ బిగినింగ్ లో వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు నిధి అగర్వాల్. గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ శంకర్ మూవీతో బంపర్ హిట్ కొట్టింది. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ 75కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. దీనితో నిధి అగర్వాల్ కి టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. 

అలాగే తమిళ్ లో మరో చిత్రం చేస్తున్నారు. జయం రవి హీరోగా తెరకెక్కుతున్న భూమి మూవీలో నిధి అగర్వాల్ నటించారు. భూమి చిత్రం దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకోగా... త్వరలో విడుదల కానుంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ హాట్ ఫొటోలతో కాకరేపుతూ ఉంటారు. నిధి అందాలకు కుర్రకారు ఫిదా కాగా.. ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ఉంది . ఆమధ్య ఓ షాప్ ఓపెనింగ్ కోసం రాజమండ్రి వెళితే... కుర్రాళ్లు ఆమెను చూడడానికి ఎగబడ్డారు. 

ఇక నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతుంది. తన పెట్ డాగ్ హ్యాపీతో ఆమెకు పెద్ద తలనొప్పి వచ్చిపడిందట. హ్యాపీ ప్రతి నిమిషం తనతోనే గడపడానికి ఇష్టపడుతుందట. చివరకు స్నానం చేయడానికి బాత్ రూమ్ కి వెళుతున్నా తనని వదలడం లేదని నిధి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.