`ఇస్మార్ట్ శంకర్‌` బ్యూటీ నిధి అగర్వాల్‌ సైలెంట్‌గా ఆఫర్స్ కొట్టేస్తుంది. `ఇస్మార్ట్ శంకర్‌` హిట్‌తో క్రేజీ హీరోయిన్‌గా మారిన ఈ భామకి తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సెక్సీ బ్యూటీ `భూమి` చిత్రంలో నటిస్తుంది. తాజాగా మరో ఆఫర్‌ని కొట్టేసింది. కోలీవుడ్‌ రొమాంటిక్‌ హీరో శింబు సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. 

శింబు, నిధి అగర్వాల్‌ జంటగా `ఈశ్వరన్‌` అనే చిత్రాన్ని తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదలైంది. ఈ విషయాన్ని నిధి అగర్వాల్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది. ఇందులో శింబు మెడలో నాగుపాము ఉండగా, ఆయన పంట చేలో నుంచి  వస్తున్నారు. తాజాగా లుక్‌ ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత శింబు చిత్రం తెలుగులో డబ్‌ కాబోతుంది.

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని `ఈశ్వరుడు` పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. మహాదేవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ - కేవీ దురై బ్యానర్ లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. దీనికి థమన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొత్తానికి ఈశ్వరుడితో రొమాన్స్ చేయబోతుందని చెప్పొచ్చు. మరోవైపు నిధి తెలుగులో గల్లా అశోక్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే రవితేజ సరసన `ఖిలాడి` చిత్రంలో నటిస్తుంది.