హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ లాక్కేమిటో గాని ఎలాంటి సినిమా చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అందంలో స్టార్ హీరోయిన్స్ కి సైతం పోటీని ఇచ్చేలా గ్లామర్ డోస్ పెంచుతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆశలన్నీ ఇస్మార్త్ శంకర్ పైనే పెట్టుకుంది. 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు మరో బ్యూటీ నటాషా కూడా నటించింది. అయితే ఎక్కువగా గ్లామర్ షోతో అదరగొట్టేది మాత్రం నిధి అగర్వాల్ అని తెలుస్తోంది. పూరి సినిమాల్లో బీచ్ సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

అదే విధంగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా నిధి అందాల ప్రజెంటేషన్ తో బీచ్ సాంగ్ మంచి కిక్కిస్తుందని ఇన్ సైడ్ టాక్. పైన కనిపిస్తోన్న ఫోటో ఈ సినిమాలోనిదే. ఆరెంజ్ డ్రెస్ లో అమ్మడు గ్లామర్ డోస్ ఏ రేంజ్ లో పెంచిందో అర్ధమవుతోంది. మరి ఈ సినిమా అమ్మడికి ఎలా కలిసొస్తుందో చూడాలి.