యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కెరీర్ ఇప్పుడిప్పుడే గాడినపడుతుంది. 2017లో వచ్చిన మున్నా మైఖేల్ మూవీతో వెండితెరకు పరిచయమైన నిధి అగర్వాల్, ఫస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్ తో అందుకుంది. తెలుగులో అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల్ కి జంటగా నటించిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు పరాజయం పాలయ్యాయి. మూడో చిత్రంగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో నిధి నటించడం జరిగింది. ఇస్మార్ట్ శంకర్ 75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సాలిడ్ హిట్ అందుకుంది. 

ప్రస్తుతం నిధి సౌత్ లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటుంది. తెలుగులో మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న డెబ్యూ మూవీలో నిధి అగర్వాల్ నటిస్తున్నారు. తమిళంలో జయం రవికి జంటగా భూమి అనే మూవీలో నిధి హీరోయిన్ కావడం విశేషం. అలాగే మరో తమిళ్ చిత్రంలో కూడా నిధి నటిస్తున్నట్లు సమాచారం. 

ఇక కెరీర్ బిగినింగ్ లోనే నిధి అగర్వాల్ పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. భారత క్రికెటర్ కే ఎల్ రాహుల్ తో ఈమె ప్రేమ వ్యవహారం నడిపినట్లు వార్తలు రావడం జరిగింది. అనేక మార్లు ఈ జంట పబ్లిక్ ప్రదేశాలలో వివాహరిస్తూ కెమెరా కంటికి చిక్కారు . దీనితో కే ఎల్ రాహుల్ మరియు నిధికి మధ్య సంథింగ్ సంథింగ్ అని గట్టిగానే కథనాలు వెలువడ్డాయి. 

ఈ డేటింగ్ రూమర్స్ ని నిధి కొట్టిపారేసింది. కే ఎల్ రాహుల్ తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని..అతడు తనకు మంచి మిత్రుడు మాత్రమే అని ఆమె ఆ వార్తలను ఖండించారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోతో నిధి ఎఫైర్ నడుపుతున్నారని వార్తలు వస్తున్నాయి.ఓ యంగ్ హీరో ప్రేమలో పడ్డ నిధి అతనితో డేటింగ్ చేస్తుందని టాలీవుడ్ టాక్. కాగా ఈ వార్తలపై నిధి  స్పందించారు. తాను ఎవరితో డేటింగ్ చేయడం లేదని, ప్రస్తుతం తన స్టేటస్ సింగిల్ అని ఆమె చెప్పుకొచ్చారు.