కోలీవుడ్ లో స్టార్ హీరోల సంఖ్య ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కమర్షియల్ గా ఆలోచించకుండా తమిళ జనాలకు నచ్చే విధంగా కథలను ఎంచుకోవడంలో అక్కడి హీరోల స్టయిలే వేరు. అదే తరహాలో సూర్య కూడా థ్రిల్ చేస్తుంటాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో సూర్య NGK కి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. 

సూర్య - సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం తెలుగు జనాలు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం సినిమా రెండు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తమిళ్ లో 100కోట్లకు పైగా బిజినెస్ చేసే సూర్యకి తెలుగులో మాత్రం టార్గెట్ చిన్నదే అని చెప్పవచ్చు. తమిళనాడులో NGK 100కోట్లు దాటితేనే బాక్స్ ఆఫీస్ హిట్ లో చేరినట్లు. 

ఇక తెలుగులో బ్రేక్ ఈవెన్ కోసం 9 కోట్లను క్రాస్ చేయక తప్పదు. ఈ టార్గెట్ సూర్యకు పెద్ద కష్టమేమి కాదనిపిస్తోంది. గతంలో టాలీవుడ్ లో 20 కోట్ల వరకు నీజీనెస్ చేసిన అనుభవం ఉంది. అయితే హిట్స్ లేకపోవడం వల్ల సూర్యకి ఇక్కడ మార్కెట్ తగ్గుతూ వస్తోంది. ఇక ఇప్పుడు సెల్వా రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించడంతో ఈ సినిమాపై తెలుగు జనాల్లో కూడా అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.