బిగ్‌బాస్‌4 రెండో వారం రెండో ఎలిమినేషన్‌ జరుగుతుంది. రెండో వారం మొదటి ఎలిమినేటర్‌ కరాటే కళ్యాణి ఆదివారం వచ్చి తన మెమరీస్‌ని పొందారు. ఆ తర్వాత తాను వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. నేను ఇందులో ఉండటం సెట్‌ కాదని, నేను ఇమడలేకపోతున్నానని తెలిపింది. 

వచ్చే వారం ఎలిమినేషన్‌ ఎవరో బిగ్‌బాంబ్‌ పేల్చేసింది. వచ్చే వారం దేవి నాగవల్లిని నామినేట్‌ చేసింది. అంతేకాదు సభ్యుల్లో టాప్‌ ఫైవ్‌, టాప్‌ బాటమ్‌ పేర్లని సూచించింది. టాప్‌ ఫైవ్‌లో హారిక, అమ్మ రాజశేఖర్‌, మోనాల్‌, దివి, అభిజిత్‌ పేర్లని, బాటమ్‌లో గంగవ్వ, కుమార్‌ సాయి, అరియానా, సుజాత, సోహైల్‌ పేర్లని సూచింది. 

ఇక తనదైన స్టయిల్‌లో ఓ హరికథ చెప్పి అందరిని ఆకట్టుకుంది. ఇక కళ్యాణిని నాగ్‌ ఇంటికి పంపించేశాడు. 

ఉన్న ఏడుగురు నామినేషన్‌ సభ్యుల లక్‌ని పరీక్షించారు. టీమ్‌ లీడర్‌ నోయల్‌ ఏడు బెలూన్స్ తెచ్చి ఇచ్చాడు. అందులో రెడ్‌ కలర్‌ వస్తే డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టు అని, గ్రీన్‌ వస్తే సేఫ్‌ అని బిగ్‌బాస్‌ నాగ్‌ చెప్పారు. ఈ గేమ్‌లో అభిజిత్‌, కుమార్‌ సాయి సేఫ్‌ అయ్యారు. అమ్మ రాజశేఖర్‌, హారిక, నోయల్‌, మెహబూబ్‌, సోహైల్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టు
తెలిసింది. 

దీని తర్వాత ఎలిమినేషన్‌ నుంచి సేఫ్‌ అయ్యే మరో గేమ్‌ స్టార్ట్ చేశారు. `బోన్‌ గేమ్‌` పెట్టారు. పాట వస్తుంది. అది ఆగిపోయినప్పుడు బోన్‌ ముందు ఎవరు తీసుకోవాలో వారు విన్నర్‌ అని, ఓడిపోయిన వారికి పనిష్‌మెంట్‌ ఉంటుంది. మొదటగా అభిజిత్‌, అఖిల్‌ గేమ్‌ ఆడగా అఖిల్‌ విన్నర్‌.. మోనాల్‌, హారిక ఆడగా, మోనల్‌ విన్నర్‌.. సోహైల్‌, మెహబూబ్‌ గేమ్‌ ఆడగా మెహబూబ్‌ విన్నర్‌.. అయితే సోహైల్‌, మెహబూబ్‌ మధ్య బోన్‌ కోసం పెద్ద కొట్టాటే జరిగింది. 

దేవి, అమ్మ రాజశేఖర్‌లో దేవి విన్నర్‌.. సుజాత, లాస్యలో సుజాత విన్నర్‌.. దివి, అరియానాలో దివి విన్నర్‌.. కుమార్‌ సాయి, గంగవ్వలో గంగవ్వ విన్నర్‌.. అవినాష్‌, నోయల్‌ ఆడగా అవినాష్‌ విన్నర్‌ అయ్యారు. 

మధ్యలో ఎలిమినేషన్‌ నుంచి అమ్మ రాజశేఖర్‌ సేఫ్‌ అయిన నాగ్‌ చెప్పారు. ఇక గేమ్‌ చివర్లో సోహైల్‌, నోయల్‌ సేఫ్‌ అయినట్టు కరపత్రం తెలిపింది. ఇక ఫైనల్‌గా మోనల్‌, హారిక మిగిలిపోయారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌, ఎవరు సేఫ్‌ అన్నది ఉత్కంఠ నెలకొంది. 

మోనాల్‌ గజ్జర్‌, దేత్తడి హారిక మధ్య చివరి నిమిషం వరకు గేమ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఎవరు ఉంటారు, ఎవరు పోతారో అని. నామినేషన్‌ కాని ఏడుగురు వీరిద్దరు ఎవరికి మద్దతు పలుకుతున్నారో చెబుతూ వాటర్‌ పోయాల్సి ఉంది. ఆరుగురు వరకు ఇద్దరికీ సేమ్‌ వచ్చాయి. చివరగా సుజాత.. హారికని ఎలిమినేషన్‌కి సిఫార్సు చేయగా, ఆమెని ఇంటిసభ్యులందరూ కలిసి పంపించేందుకు రెడీ అయ్యారు. 

అయితే తాను ఎలిమినేట్‌ కావడంపై హారిక కన్నీళ్ళు పెట్టుకుంది. అదే సమయంలో తాను చివరి నిమిషంలో బయటపడంతో మోనాల్‌ ఎమోషనల్‌ అయిపోయింది. హారికని పంపించే విషయంలో సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు. గేట్‌ తెరచి హారిక వెళ్ళేలోపు చివరి క్షణంలో బిగ్‌బాస్‌ `హారిక స్టాప్‌` అని చెప్పేశాడు. ఆమెని ఎలిమినేట్‌ చేయడం లేదని ప్రకటించాడు. దీంతో సభ్యులంతా సంతోషంతో ఎగిరి గంతేశారు. 

అయితే నాగ్‌ ఈ టెస్ట్ పెట్టడానికి కారణం సెల్ఫ్‌ నామినేషన్‌ అని, ఎవరూ సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకోకూడదని, ఇక్కడికి వచ్చింది ఆడటానికి, వెళ్ళిపోవడానికి కాదని, ఈ అవకాశం రావడం గొప్ప విషయమని గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఇదొక వార్నింగ్‌ అని, ఇకపై ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆడాలని స్పష్టం చేశారు. దీంతో సభ్యులంతా ఊపిరిపీల్చుకున్నారు. 

తాజాగా మరో రికార్డ్ ని సృష్టించింది. ఇది ఇండియాలోనే అత్యధిక రేటింగ్‌ పొందిన `బిగ్‌బాస్‌` షోగా నిలిచిందట. ఆదివారం షో ఎండింగ్‌లో నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. మొదటి వారం దేశంలోనే తెలుగు బిగ్‌బాస్‌4కి అత్యధిక రేటింగ్‌ వచ్చి సరికొత్త రికార్డుని సృష్టించిందని చెప్పారు.