కింగ్ నాగార్జున హీరోగా విజయ్ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా మన్మథుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. సోనాలి బ్రిందే మెయిన్ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా అన్షు అంబానీ నటించింది. ఈ సినిమా తరువాత ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన రాఘవేంద్ర సినిమాలో మాత్రమే కనిపించింది అన్షు. తరువాత తమిళ్‌లో జై అనే సినిమాలో నటించిన ఇండస్ట్రీ దూరమైంది.

మన్మథుడు సినిమా రిలీజ్‌ అయి 18 ఏళ్లు అవుతున్నా ఆ సినిమాలో అన్షు పోషించిన మహేశ్వరి పాత్ర తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలాగే నిలిచిపోయింది. అమాయకత్వం ప్రేమ కలగలిసి ఆమె చూపులు సినీ అభిమానులకు అలాగే గుర్తుండిపోయాయి. అయితే తాజాగా అన్షు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల అన్షు ఫోటోలు మరోసారి మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాలు మానేసిన తరువాత సచిన్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం లండన్‌లో సెటిల్‌ అయ్యింది.

సినిమాల్లోకి రాకముందే ఫ్యాషన్‌ డిజైనింగ్ చేసిన ఈ భామ లండన్‌ తన సొంత డిజైనింగ్  చైన్‌ ఇన్సిపిరేషన్‌ కోచర్ ను నిర్వహిస్తోంది. లండన్‌లోనే పుట్టి పెరిగి అన్షు చదువు కూడా లండన్‌లోనే పూర్తి చేసింది. ప్రస్తుతం ఓ పాపకు తల్లిగా, బిజినెస్‌ ఉమెన్‌ రెండు పాత్రల్లోనూ అద్బుతంగా పోషిస్తోంది. తాజాగా భర్త, కూతురుతో ఉన్న అన్షు ఫోటోలు మీడియాలో దర్శన మివ్వటంతో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.