అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. ప్రత్యూష అనే అమ్మాయితో అభిరామ్ పెళ్లి ఘనంగా శ్రీలంకలో జరిగింది. 

అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. ప్రత్యూష అనే అమ్మాయితో అభిరామ్ పెళ్లి ఘనంగా శ్రీలంకలో జరిగింది. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ కి దగ్గుబాటి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. గత కొంతకాలంగా అభిరామ్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే ఎట్టకేలకు అభిరామ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అభిరామ్ పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు.. తనకు మరదలు వరస అయ్యే అమ్మాయినే. ఆమె పేరు ప్రత్యుష. శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ డిసెంబర్ 7న జరిగింది. వివాహ వేడుక పూర్తి కావడంతో దగ్గుబాటి కుటుంబ సభ్యులు.. నవ దంపతులు అభిరామ్, ప్రత్యుష శ్రీలంక నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. 

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవ దంపతులు ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. ప్రత్యుష చీరకట్టులో విమానాశ్రయంలో మెరిసింది. ప్రత్యూష బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిరామ్ కి ఆమె మరదలు వరస అవుతుంది. 

View post on Instagram

వారి స్వస్థలం కారంచేడు. సురేష్ బాబు తండ్రి, ఒకప్పటి అగ్ర నిర్మాత రామానాయుడు స్వగ్రామం కూడా కారంచేడు కావడం విశేషం. వీరి బంధువుల అమ్మాయే ప్రత్యుష. రామానాయుడు తమ్ముడి మనవరాలినే(రామానాయుడు తమ్ముడి కూతురు బిడ్డ) అభిరామ్ పెళ్లి చేసుకున్నాడు. 

అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అహింస చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. పెళ్లి తర్వాత అయినా ఈ దగ్గుబాటి అబ్బాయి కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి. 

Also Read: ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, రమ్యకృష్ణ వీళ్ళు కనుక విలన్స్ అయితే ఏ హీరో నిలబడలేడు.. విధ్వంసమే కదా..