ఈ హీరోలు విలన్లైతే.. బొమ్మ బ్లాక్ బస్టర్!

First Published 1, Feb 2019, 11:10 AM

ఈ హీరోలు విలన్లైతే.. బొమ్మ బ్లాక్ బస్టర్!

హీరోగా కెరీర్ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు 'బాహుబలి'లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడు రానా. ఈ సినిమాలో తన నటనతో యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. బాహుబలి సక్సెస్ క్రెడిట్ లో రానా పోషించిన పాత్ర పెద్దదే..

బాలీవుడ్ లో అగ్ర హీరోగా వెలుగొందుతోన్న అక్షయ్ కుమార్ '2.0'తో విలన్ గా మారాడు. అయితే సినిమాలో ఆయన పాత్రని పాజిటివ్ యాంగిల్ లోనే ప్రొజెక్ట్ చేశారు. బాలీవుడ్ సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే దానికి కారణం అక్షయ్ కుమార్ అనే చెప్పాలి.

ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన జగ్గుభాయ్ విలన్ గా మారిన తరువాత టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు సంపాదించుకున్నాడు. పెద్ద హీరోల సినిమాలంటే అందుకే జగపతిబాబు ఉండాల్సిందే. ఆ రేంజ్ లో తన స్టామినాను పెంచుకున్నాడు.

కన్నడ స్టార్ హీరో సుదీప్ ని 'ఈగ' సినిమాలో విలన్ గా చూపించాడు రాజమౌళి. సినిమా మొత్తం సుదీప్ చుట్టూనే తిరుగుతుంది. తన నటనతో పాత్రకు ప్రాణప్రతిష్ట చేశాడు.

సినిమా ఇండస్ట్రీలో అందగాడని చెప్పుకునే అరవింద్ స్వామి తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆయన రీఎంట్రీ ఇచ్చిన 'తని ఒరువన్' సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్. అదే సినిమాను తెలుగులో రీమేక్ కూడా చేశారు. అందులో కూడా అరవింద్ స్వామినే నటించారు.

లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న మాధవన్ తెలుగులో 'సవ్యసాచి' చిత్రంతో విలన్ గా పరిచయమయ్యాడు. ఇప్పటికీ ఆయన హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నా.. కథ నచ్చడంతో విలన్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమాలో ఆయన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తమిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన ఆది పినిశెట్టి తెలుగులో కూడా బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేశాడు. అయితే హీరోగానే కాకుండా మంచి పాత్రలు కోసం చూసిన ఆది 'సరైనోడు' సినిమాలో విలన్ గా కనిపించాడు. ఆ సినిమా సక్సెస్ లో ఆది కీలక పాత్ర పోషించాడు. హీరోగానే కాదు.. విలన్ గా కుడా మెప్పించగలనని నిరూపించాడు.

తెలుగులో హీరోగా వరుస సినిమాలు చేస్తోన్న సుదీర్ బాబు గతంలో బాలీవుడ్ లో 'భాగి' అనే సినిమాతో విలన్ గా మారాడు. సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినప్పటికీ విలన్ గా సుదీర్ బాబుకి మంచి మార్కులే పడ్డాయి.

ఓ వైపు హిందీ చిత్రాల్లో హీరోగా నటిస్తూనే అడపాదడపా విలన్ పాత్రలు చేస్తోన్న వివేక్ ఒబెరాయ్ తెలుగులో విలన్ పాత్రలతో మెప్పించాడు. రీసెంట్ గా విడుదలైన 'వినయ విధేయ రామ' చిత్రంలో అత్యంత క్రూరుడైన విలన్ గా వివేక్ మెప్పించాడు.

హీరోగా బాలీవుడ్ లో సినిమాలు చేసిన నీల్ నితిన్ ముఖేష్ ఇప్పుడు విలన్ గా కనిపించడానికి వెనుకాడడం లేదు. 'సాహో' సినిమాలో విలన్ గా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ఈ నటుడు.